లారీ డ్రైవర్లపై ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. రాత్రి పూట డ్రైవ్ చేసే వారికి రోడ్డు పక్కన గల హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ అందజేస్తామని ప్రకటన చేసింది.
Lorry Drivers Serve Free Tea: సరుకును లారీలలో (Lorry) తీసుకెళ్లే సమయం రాత్రి.. సిటీలలో హెవీ వెహికిల్స్ నైట్ పూట మాత్రమే అనుమతి ఇస్తుంటారు. రకరకాల కారణాలతో రాత్రి పూట వారి డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఇందుకోసం నిద్రహారాలు మాని.. డ్రైవ్ చేస్తారు. సెకను కాలంలో కునుకు తీయడంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఒడిశా ప్రభుత్వం లారీ డ్రైవర్లపై (Lorry Drivers) సానుభూతి చూపింది.
రోడ్డు పక్కన గల హోటళ్లు (hotel), దాబాలలో (dhaba) లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందజేస్తామని ప్రకటించింది. ఆ ఖర్చును ప్రభుత్వం భరిస్తోందని రవాణా శాఖ మంత్రి టుకుని సాహు ప్రకటన చేశారు. అంతేకాదు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు. అందులో డ్రైవర్లు నిద్రపోయేందుకు, స్నానం చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు. అక్కడ టీ, కాఫీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాత్రి పూట సరకు రవాణా చేసే లారీ డ్రైవర్లపై ఒడిశా ప్రభుత్వం కరుణ చూపింది. ఉచితంగా ఛాయ్ పంపిణీ చేస్తామని ప్రకటించి, ఉదారతను చాటుకుంది.