»Ed Sent Notice To Delhi Cm And Aap Leader Arvind Kejriwal
Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది.
Delhi Liquor Policy Case : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది. అంతకుముందు నవంబర్ 2న, ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌కు విచారణ కోసం నోటీసు పంపింది. అయితే ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇతర నిందితుల విచారణ ఆధారంగా ఈడీ కేజ్రీవాల్‌ను ప్రశ్నించాలని కోరుతోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం బీజేపీ తమ పార్టీని నాశనం చేయాలని చూస్తోందని ఆప్ అంటోంది. గత సారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసు పంపినప్పుడు, ఆయన్ను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తాం. ఇందుకోసం ఆ పార్టీ ప్రచారం కూడా ప్రారంభించింది.