గుంటూరు రెడ్డిపాలెం మదర్ థెరిస్సా కాలనీలో కిల్కారి ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు గర్భిణీలు, బాలింతలకు కిల్కారి కాల్ సేవల ప్రయోజనాలను వివరించారు. వాయిస్ కాల్స్ ద్వారా తల్లి-బిడ్డల ఆరోగ్యంపై ముఖ్య సమాచారం అందుతుందని, కేంద్రం నుంచి వచ్చే కాల్స్‌ను తప్పకుండా వినాలని సూచించారు. మిస్ అయిన కాల్స్‌ను 14423 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మళ్లీ వినవచ్చని ఆయన తెలిపారు.