»Large Scale Transfers Of Ias Officers Took Place In Telangana
IAS Transfer : రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఐఏఎస్ అధికారల బదిలీలు చేపట్టింది. ఆదివారం 11మందిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Transfer : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఐఏఎస్ అధికారల బదిలీలు చేపట్టింది. ఆదివారం 11మందిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి. వెంకటేశం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వీ కర్ణన్, అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్, రోడ్లు, భవనాలు, రవాణాశాఖ కార్యదర్శిగా శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శిగా అరవింద్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇటీవల ఐఏఎస్ అధికారి అమ్రాపాలిని హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించారు. ట్రాన్స్ కో మరియు జెన్ కో సీఎండీగా రిజ్వి ని నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ఎంపీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంపీడీసీఎల్ సీఎండీగా క్రాంతి వరుణ్ రెడ్డిని నియమించారు. డిప్యూటీ సీఎం ఓఎస్ డీగా కృష్ణ భాస్కర్ ను నియమించారు. ఆరోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ కార్యదర్శిగా శైలజా అయ్యర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్తు శాఖలో భారీ మార్పులు చేపడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాను నియమించారు.