కింగ్ నాగార్జున తాజా చిత్రం నా సామిరంగ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ సంక్రాంతి పండగకు సందడి చేయనుంది. టీజర్లో నాగార్జున ఇరగదీశాడు. ఆ ఫైట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజాగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ (Naa Saami Ranga Movie). ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఆషికా రంగనాథ్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా నేడు ఈ మూవీ టీజర్ విడుదలైంది (Teaser Release).
‘నా సామిరంగ’ మూవీ టీజర్:
టీజర్ (Teaser) చూశాక ఈమూవీ కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో జరుగుతుందని తెలుస్తోంది. టీజర్లో నాగార్జునతో పాటు మరో ఇద్దరు టాలీవుడ్ (Tollywood) హీరోలు కనిపిస్తారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రలు కామెడీని పండిస్తాయి. టీజర్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్ నాగార్జున హీరోయిజం గురించి అడిగితే అల్లరి నరేశ్ అదిరిపోయే లెవల్లో చెబుతాడు. టీజర్ అంతా దానిపైనే నడుస్తుంది.
నా సామిరంగ మూవీ (Naa Saami Ranga Movie)కి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే నా సామిరంగ చిత్రం నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ సంక్రాంతి పండగకు అందరికీ వినోదాన్ని పంచేందుకు సిద్దంగా ఉంది.