ఓ మహిళ పిలవగానే సీఎం పలికారు. అంతటితో ఆగలేదు. ఆమె సమస్యను తెలుసుకుని..వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దృశ్యం నిన్న తెలంగాణలోని హైదారాబాద్లో చోటుచేసుకోగా..ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.
The CM revanth reddy responded by saying Revanth Anna at yashoda hospital hyderabad
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తాము ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ ప్రధానంగా ఇచ్చిన ఆరు హామీలలో రెండింటిని అమలు చేస్తున్నారు. వాటిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సహా ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చుల పరిధిని 10 లక్షలకు పెంచుతు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు సీఎం గా రేవంత్ రెడ్డి(revanth reddy) ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టు ఉన్న కంచెలను సైతం తొలగించాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటివల ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
CM Revanth Responded to the Grievance of Common People Issue Quickly
రేవంత్ అన్న అంటూ పిలిచి సమస్య చెప్పుకున్న మహిళ.
— వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఓ మహిళ రేవంతన్నా అని పిలవగానే సీఎం వెంటనే స్పందించారు. ఈ సంఘటన యశోద ఆస్పత్రిలో ఆదివారం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్(KCR) కాలు జారీ కిందపడి అనారోగ్యం బారిన పడటంతో అతన్ని కలిసి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ క్రమంలోనే తిరిగి వెళ్తున్న క్రమంలో రేవంత్ రెడ్డిని ఓ మహిళ పిలిచారు. వెంటనే స్పందించిన సీఎం ఆమె వద్దకు వెళ్లారు. తన సమస్య గురించి తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలో మహిళ తన పాప అనారోగ్యం బారిన పడిన క్రమంలో ఆస్పత్రికి వచ్చానని డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయని సాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. దీంతో వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆ క్రమంలో పలువురు ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అంతే ఇది చూసిన నెటిజన్లు రేవంత్ రెడ్డి గ్రేట్ అంటూ కామెంట్లు(comments) చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం గతంలో రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి నిజంగా మంచి మనసున్న ప్రజల మనిషి అని కొనియాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా ధర్బార్ పేరుతో ప్రజల సమస్యలను అధికారులు స్వీకరిస్తున్నారు. వాటిని త్వరతిగతిన తీర్చేందుకు చర్యలు కూడా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎలాంటి మార్పులు వాస్తాయో చూడాలి మరి.