»Cold Weather Affect Increasing Cases Of Pneumonia In Children Hyderabad
Cold weather affect: పిల్లల్లో పెరుగుతున్న న్యూమోనియా కేసులు
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలివాతావరణం పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలను ఎక్కువగా బయట తిరగనివ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. చలికారణంగా గత కొన్ని రోజులుగా అనేక మంది చిన్నారులు న్యుమోనియా(pneumonia) బారిన పడుతున్నట్లు తెలిపారు.
cold weather affect Increasing cases of pneumonia in children hyderabad
పిల్లలకు చలిగాలులు(cold weather) చాలా హానికరం. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నపిల్లలు ఇతర పిల్లలతో పోలిస్తే బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు లోనవుతారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ పిల్లల ఆస్పత్రి నిలోఫర్లో ఇప్పటికే 50 మందికిపైగా పిల్లలు చేరారు. వారిలో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్స కోసం వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే కొంత మందిలో 5 నుంచి 6 రోజులు అయినా కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆ పిల్లలకు న్యూమోనియా వ్యాధి వచ్చినట్లు గుర్తించి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే పిల్లల పేరెంట్స్ సొంత యాంటి బయోటిక్స్ వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలం అంతా పిల్లలకు న్యుమోనియా(pneumonia), ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలం గడిచే కొద్దీ వారు ఫ్లూ, న్యుమోనియా ఫిర్యాదులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు ప్రభావాలు చాలా మంది యువకులలో చాలా కాలం పాటు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విపరీతమైన చలి నుంచి వారిని వారు కాపాడుకోవడం చాలా కీలకమని వైద్యుల అంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చలికాలంలో పిల్లలకు తగిన దుస్తులు ధరించేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ శిశువు తల, చెవులను కప్పి ఉంచాలని కోరుతున్నారు. ఈ సీజన్లో జ్వరం, దగ్గు లేదా జలుబు వంటి లక్షణాల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
న్యుమోనియా అనేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా వైరల్(viral) లేదా బాక్టీరియల్ పాథోజెన్ల వల్ల వస్తుంది. కానీ అరుదుగా ఇతర పరాన్నజీవి వల్ల కూడా వ్యాపిస్తుంది. ఈ సూక్ష్మజీవి వల్ల కలిగే న్యుమోనియా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికారక క్రిములు ముక్కు, గొంతు ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి, దీని వలన గాలి సంచులలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో, ఆక్సిజన్ లేకపోవడంతో శ్వాసక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ సందర్భంలో పిల్లలు శ్వాస సమస్యలతో బాధపడవచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు శ్వాసకోశ సమస్య, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక పరిస్థితులతో నివసించే వారు న్యుమోనియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.