Hi nanna: ఫస్ట్ డే కలెక్షన్స్ ఘోరం..పెట్టిన బడ్జెట్ కూడా కష్టమే!
ఈ వారం హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తండ్రి కూతుళ్ల నేపథ్యంలో పక్కా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది హాయ్ నాన్న. దీంతో మంచి బజ్‌తో డిసెంబర్ 7న థియేటర్లోకి వచ్చిన హాయ్ నాన్న.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఓవరాల్‌గా హాయ్ నాన్న రూ.28 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఉన్నా టాక్ ప్రకారం.. నాని ఈ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాడని అంటున్నారు. కానీ ఫస్ట్ డే మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే రూ.5 కోట్లకు పైగా షేర్.. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం ఇది చాలా తక్కువనే చెబుతున్నారు.
ప్రస్తుతం థియేటర్లో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి మూవీ అనిమల్ హవా నడుస్తోంది. అలాగే.. హాయ్ నాన్న రిలీజ్ అయిన రోజే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇలాంటి చాలా కారణాలు హాయ్ నాన్న సినిమా డే వన్ కలెక్షన్స్‌పై ఇంపాక్ట్ చూపించాయనే చెప్పాలి. కానీ నాని సినిమాలు బాగుంటే.. డే 1 కన్నా డే 2, డే 3 కలెక్షన్స్ పెరుగుతాయి. నాని కూడా అదే చెప్పాడు. ఫస్ట్ డే టికెట్స్ దొరికినా.. సెకండ్, థర్డ్ డేకి ఒక్క టికెట్ కూడా దొరకదని ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. కాబట్టి.. హాయ్ నాన్న టాక్ ప్రకారం మంచి వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాలో నాని, మృణాల్ పెయిర్ అదిరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా బేబీ కియారా యాక్టింగ్ బాగుందని అంటున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్లు కాగా..పెట్టిన మొత్తం కూడా వచ్చే ఛాన్స్ లేదని పలువురు అంటున్నారు.