»Mahesh Babu And Sreeleela Next Song Plans Guntur Kaaram
Gunturkaaram: మహేష్ బాబు, శ్రీలీల పై సూపర్ సాంగ్!
ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి వస్తున్నాం. హిట్ కొడుతున్నామని చెబుతునే ఉన్నారు గుంటూరు కారం మేకర్స్. అందుకు తగ్గట్టే షూటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు, శ్రీలీల పై అదిరిపోయే సాంగ్ షూట్‌కు రెడీ అవుతున్నారట.
mahesh babu and sreeleela next song plans guntur kaaram
అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu). అయితే ఇప్పటి వరకు బుల్లితెరపైనే హిట్ అయిన ఈ కాంబినేషన్.. ఈ సారి బిగ్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. పండగ సీజన్ కాబట్టి.. టాక్‌తో సంబంధం లేకుండా రీజనల్ బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం భారీ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ. ఇప్పటికే తమన్ ఇచ్చిన దమ్ మసాలా మాస్ బీట్ రిలీజ్ చేసిన మేకర్స్.. రేపో మాపో సెకండ్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో శ్రీలీల(sreeleela), మీనాక్షి చౌదరి హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేశారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సాంగ్‌ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారట మేకర్స్. డిసెంబర్ 25 వరకు ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసి..సినిమాకు ప్యాకప్ చెప్పనున్నారట. సినిమాలో ఈ సాంగ్ అదిరిపోనుందట. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.
కానీ ఈ సినిమా రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ దమ్ మసాలా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అందుకే..రేపో మాపో సెకండ్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే.. న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లనున్నాడు మహేష్ బాబు. తిరిగొచ్చిన తర్వాత ‘గుంటూరు కారం(guntur kaaram)’ ప్రమోషన్స్ చేయనున్నాడు.