Ritika Singh injured in Rajinikanth’s film shooting
Ritika Singh: గురు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటి రితికా సింగ్ (Ritika Singh). ఆ మూవీ తర్వాత స్టార్ హీరోయిన్ కాకపోయినా, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అవకాశాలను అందుకుంటున్నారు. తదుపరి చిత్రం షూటింగ్ సమయంలో రితికా సింగ్ గాయపడింది. రజనీకాంత్, దర్శకుడు TJ జ్ఞానవేల్‌తో నటి తదుపరి చిత్రం, తలైవర్ 170 సెట్స్‌లో రితికా గాయపడినట్లు తెలుస్తోంది. పగలిన గాజు ముక్క గుచ్చుకోవడంతో గాయం అయినట్లు సమాచారం.
రితికా సింగ్ చేతికి గాయాలైన ఫోటో.. చేతికి గాయాలవడం వల్ల అప్ సెట్ అవుతున్నా అంటూ రితికా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రితిక ఏ సినిమా షూటింగ్లో అనేది క్లారిటీ ఇవ్వనప్పటికీ దర్శకుడు TJ జ్ఞానవేల్ డైరెక్షన్లో రజనీకాంత్ నటిస్తున్న ‘తలైవర్ 170’ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్‌గా అందరూ భావిస్తున్నారు. పగిలిన గాజు పెంకుల కారణంగా చేతికి గాయమైనట్లు రితికా వీడియోలో చెప్పింది.
వీడియోలో ‘నేను చాలా అప్ సెట్ అయ్యాను.. అక్కడ గ్లాస్ ఉంది.. జాగ్రత్త అని నాకు చెబుతూనే ఉన్నారు.. ఒక్కోసారి అలా జరిగిపోతుంది. కొన్ని పరిస్థితులను ఆపలేం.. కొన్ని సందర్భాల్లో నియంత్రణ కోల్పోతాం.. ప్రస్తుతానికి ఎటువంటి పెయిన్ లేదు.. చర్మం లోపలికి గాయం అయ్యింది.. సెట్ నుండి హాస్పిటల్‌కి వెళ్తున్నాను..’ అంటూ రితికా ఆ వీడియోలో చెప్పారు. రజనీకాంత్ సినిమా షూటింగ్లో రితికా సింగ్ గాయపడిందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ చేత చెక్ అవుట్ చేయించుకోవడానికి షూటింగ్ నుంచి విరామం తీసుకున్నానని పేర్కొంది. త్వరగా కోలుకోవాలని, త్వరలో సెట్స్‌పైకి రావాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన తలైవర్ 170 సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనున్నారు. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది వేసవికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.