Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
అనారోగ్య బాధలు అధిగమిస్తారు. కొత్తగా చేపట్టే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ఫలితం వస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి చూస్తారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభ రాశి
అనారోగ్య బాధలు అధికం అవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంది. అనవసర భయానికి లోనవుతారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.
మిథున రాశి
కొత్త వస్తు, వస్త్ర, వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి
విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు అధికం అవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహ రాశి
బంధు, మిత్రులను కలుస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. శతృబాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
కన్య రాశి
విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
తుల రాశి
స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. వృథాగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
ధనుస్సు రాశి
కావాల్సిన విధంగా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఇతరుల విమర్శలకు గురవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి
గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుంభ రాశి
నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అబద్దానికి దూరంగా ఉండటం మంచిది. అనవసరంగా భయాందోళనకు గురవుతారు.
మీన రాశి
ఆకస్మిక ధన లాభయోగం ఉంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.