»The Italian Prime Minister Who Took A Selfie With Modi And Posted It Is Called Melodi
#Melodi: మోదీతో సెల్ఫీ దిగి అలా పోస్ట్ చేసిన ఇటాలియన్ ప్రధాని..’మెలోదీ’ అంట!
దుబాయ్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు కాలుష్య నివారణకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 7 ద్వైపాక్షిక సమావేశాల్లో పలు కీలక విషయాల గురించి చర్చించారు.
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) 28వ సమ్మిట్‌కు దుబాయ్ వేదిక అయ్యింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల నేతలు ప్రపంచ వాతావరణ మార్పులపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీ సెల్ఫీ దిగి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఆమె రాసుకొచ్చారు.
ఈ సమావేశాలు డిసెంబర్ 12వ తేది వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2015లో పారిస్, 2021లో గ్లాస్గో పర్యటనల తర్వాత ప్రపంచ వాతావరణ కార్యాచరణ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేర్చడానికి, ఫైనాన్స్, టెక్నాలజీ చాలా అవసరమని, 2028లో COP33ని భారతదేశంలో నిర్వహించాలని సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు.
Incontro con PM @GiorgiaMeloni dell'Italia a margine del #COP 28 Summit.
Confido negli sforzi congiunti di India e Italia per un futuro prospero e sostenibile. pic.twitter.com/zdCSLHOKya
ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరుగుతోందని, ఆ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభాలో 17 శాతం వాటా ఇండియాకు ఉందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు అందరూ పనిచేస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు. 21 గంటల పాటు దుబాయ్‌లో ఉన్న ప్రధాని మోదీ..7 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. నాలుగు చోట్ల తన ప్రసంగాన్ని వినిపించారు. ఆ తర్వాత ఆయన దుబాయ్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు.