»Swiggy Delivery Agent Travels Extra 12 Km At 3 Am To Hand Over Food Wins Hearts
Swiggy boy: నెటిజన్ల మనసు గెలిచిన స్విగ్గీ డెలివరీ బాయ్..!
ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఓ కస్టమర్ ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ట్విట్టర్ లో ఓ వినియోగదారుడు రాంగ్ అడ్రస్ తో పుడ్ ఆర్డర్ చేశాడట. అయితే అతని డెలివరీ ఏజెంట్ తెల్లవారుజామున 3 గంటలకు అతనికి ఆహారం ఇవ్వడానికి 12 కి.మీ అదనంగా ప్రయాణించి మరీ ఫుడ్ అందించాడట. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ లో షేర్ చేశాడు. అతను ట్వీట్ లో ఏం రాశాడంటే..”చాలా రోజుల తర్వాత ఆలస్యంగా హోటల్‌కి వచ్చాను. అన్ని రెస్టారెంట్లు మూతబడ్డాయి కాబట్టి @Swiggyలో ఫుడ్ ఆర్డర్ చేశారు. నాకు హైదరాబాద్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి, లొకేషన్ తప్పుగా ఉంది. కానీ డెలివరీ ఏజెంట్ అన్ని తంటాలు పడి రైడ్ చేశాడు. నన్ను వెతకడానికి 12 కి.మీలు ప్రయాసపడ్డాడు. భయ్యా నేను ఉదయం నుండి ఏమీ తినలేదు అని చెప్పగానే అతను వచ్చి ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు. ఎవరూ ఆకలితో ఉండకూడదు. అని చెప్పి ఫుడ్ ఇచ్చాడు. అతని పేరు మహమ్మద్ ఆజం అని స్విగ్గీ యూజర్ రాసుకొచ్చాడు. నవంబర్ 26న తన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఇప్పటివరకూ ఆ పోస్ట్ లక్షకు పైగా వీక్షణలు పొందింది. అందరూ ఆ స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.