»Mama Machindra Movie Explained In Telugu Sudheer Babu Eesha Rebba Mirnalini Ravi
Mama Machindra: పరసురామ్ సోంత చెల్లిని, అల్లుల్లనే ఎందుకు చంపాలనుకుంటాడు?
పరసురామ్ ఒక బిజినెస్ మ్యాన్. తనకు తన కుతురు అంటే ఎంత ఇష్టం ఉంటుందో, తన దగ్గర పనిచేసే దాసు కూతురు అన్నా అంతే ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడే కూతళ్లను మార్చిన పరసురామ్ తన దగ్గర పెరుగుతున్నది దాసు కూతురు అని ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మోడర్న్ గా పెంచుతాడు. అదే సమయంలో తన ఇద్దరు కూతుళ్లను డీజే, దుర్గ ఇద్దరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకొని వారిని అంతం చేద్దామనుకుంటాడు. వారెవరో కాదు చిన్నప్పుడే తప్పిపోయిన తన చెల్లెలు కొడుకులు అని నిజం తెలుస్తుంది. అయినా సరే వారందరిని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ తెలిసి షాక్ అవుతాడు. డీజే, గుణ ఇద్దరు ఎవరు. దాసు చెప్పిన అసలు నిజం ఏంటి అనేది మామా మశ్చీంద్ర.
Mama Machindra: ఓపెన్ చేస్తే టాప్ యాంగిల్ నుంచి కార్ వెళ్తుంది. కొంతమంది పోలీసులు కొంత దూరంలో వెయిట్ చేస్తారు. కారును ఆపుతారు. ఒక మర్డర్ కేసులలో అనుమానితుడిగా ఉన్నారని అరెస్ట్ చేయాలని కారులో ఉన్న పరసురాంతో ఎస్ఐ అంటాడు. సరే అని వాళ్లకు కో ఆపరేట్ చేస్తారు పరసురాం. సర్ దగ్గర కారును హ్యండోవర్ చేసుకోండి అని కానిస్టేబుల్స్ కు కన్ను కొట్టి చెప్తాడు ఎస్ఐ. కారు నుంచి కొంత దూరం వెళ్లి ఇంత ప్లాన్ చేసి పరసురాంను అరెస్ట్ చేస్తే, ఇప్పుడు అరెస్ట్ ఆపెయ్ అని అంటారేంటి అని పృథ్వీతో మాట్లాడుతాడు ఎస్ఐ. దుర్గను మనవాళ్లు చంపకుండా వదిలేశారు అని పృథ్వీ చెప్తాడు. అదేసమయంలో పరసురాం ఫోన్ లాక్కుంటారు కానిస్టేబుల్స్, అతన్ని కామెంట్ చేస్తూ నవ్వుతారు. కారు డిక్కిలో ఏం ఉందో చూడమని చెప్పగానే.. ఒక కానిస్టేబుల్ డిక్కిని తెరుస్తాడు. అందులో డబ్బు ఉంటుంది. డబ్బున్న బ్యాగ్‌ను పట్టుకొని ఎస్ఐ దగ్గరకు వెళ్తాడు కానిస్టేబుల్. దాంతో వాడి డబ్బు వాడికి ఇవ్వండి అని, వాన్ని చంపిన తరువాత డబ్బులు తీసుకోండి అని పృథ్వీ చెప్తాడు. ఎస్ఐ టెన్షన్ పడుతుంటాడు. కట్ చేస్తే కార్లో నుంచి ఇద్దరు పోలీసులు వ్యాన్ నుంచి కిందపడుతారు. బండితీస్తాడు కానిస్టేబుల్ అది ఎసఐమీదకు దూసుకొస్తుంది. ఎస్ఐ తప్పించుకుంటాడు. మరో ఇద్దరు కాని కానిస్టేబుల్స్ వ్యాన్ నుంచి కిందపడుతారు. బ్లడ్ కారుతుంది. సిల్హౌట్ షాట్ తో పరసురాం కత్తి చేతిలో పట్టుకొని వ్యాన్ నుంచి కిందికి దిగుతాడు. ముఖం అంతా బ్లడ్ తో నిండి ఉంటుంది. పంప్ సెట్ వస్తున్న నీళ్లతో బ్లడ్ కడుక్కుంటాడు. వెనకనుంచి కానిస్టేబుల్ పట్టుకుంటే వాని మెడలు ఇరుస్తాడు. ఎస్ఐని తన్నుతాడు. కారును తీసుకొని అందులో బ్యాగ్ పెట్టుకొని అక్కడినుంచి వెళ్లిపోతాడు.
దాస్ ఫోన్ చేసి ఇలా జరిగింది ఏంటి బాసు అని అడుగుతాడు. పోలీసులను కూడా గొంగలా మార్చేదే డబ్బు అని పరసురామ్ చెప్తాడు. ఇలాంటి సందర్భంలో పిల్లలు తనతో ఉండడం సేఫ్ కాదని, పారీస్ లో సెటిల్ అయ్యేంతవరకు పిల్లలను దూరం పెట్టాలి అని చెప్తాడు. ఫోన్ కట్ అయిన తరువాత దాస్ ఆలోచిస్తుంటాడు. పరసురామ్ మ్యూజింగ్స్ వింటాడు. ఈ సృష్టిలో నువ్వొక్కడివే నిజం ఏది కనిపిస్తదో, ఏది వినిపిస్తదో అదే నిజం అని తన మ్యూజింగ్స్ లో చెప్తుంటాడు పరసురామ్. ఆయన మ్యూజింగ్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ అతను చెప్పిన థీయరీని ఫాలో అవుతుంటారు. నీ ఫీలింగ్స్ ను ఎవరితో పంచుకోవద్దు.. అలా సాధ్యం అవకపోతే ఒక మూలన కూర్చొని డైరీ రాసుకో అని, చాలా సీక్రెట్ విషయం అయితే ఒక సారి రాసి దాన్ని చించీ కాల్చేయ్ అని చెప్తాడు. దాస్, పరసురాం స్టోరీని డైరీగా రాస్తుంటాడు.
కట్ చేస్తే చిన్నప్పుడు పరసురాం తల్లి తనకు బంగారు గొలుసు సరిచేస్తుంది. ఆ సమయంలో కొంతమంది అనాదాలు చెత్తకుండి దగ్గర ఆహారం కోసం వెతుకుతుంటే వారిని పిలిచి అన్నం పెడుతాడు. తరువాత వారకి కొత్త బట్టలు ఇస్తాడు. అలాంటి మంచి కుటుంబంలో తన తండ్రి ఒక రాక్షసుడు అని, తన కీప్ కు ఆస్తిని ఇవ్వడానికి కట్టుకున్న భార్యను, పరసురామ్ ను చిత్రహింసలు పెడుతుంటాడు. ఆమెను కాదు, వీన్ని కొడితే సంతకం పెడుతుంది అని పరసురాంను కొట్టబోతుంటే తన చెల్లి అంజలి కొరడాను పట్టుకొని ఆపుతుంది. అంతలో తాను నెట్టెసరికి అంజలి వెళ్లి పూలకుండి మీద పడుతుంది. కళ్లుపోతాయి. పాపకు కళ్లు కనబడుతలేవని ఏడుస్తుంది. తల్లిని కొడుతున్న పరసురామ్ తండ్రి పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తరువాత పరసురాం తల్లి కోమాలోకి వెళ్తుంది. ఆ సమయంలో తన తల్లి చికిత్సకోసం తండ్రితో లేచిపోయిన ఆవిడ అన్న రమేష్ ప్రసాద్ వైట్ పేపర్లమీద సంతకం పెట్టించుకొని పరసురాంకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు తీసుకొని ఆసుపత్రికి వస్తాడు. తన తల్లి చనిపోతుంది. ఆస్తి కోసం తన తండ్రి తల్లివేలును నరికి తీసుకెళ్తాడు. అది చూసి పరసురాంకు కోపం, ఆవేశం, దుంఖం వస్తుంది. తల్లిని కాల్చిన వద్దే తనలో ఒక క్రూరుడు నిద్ర లేస్తాడు. కాలిన తల్లి బోన్ ను తీసుకుంటాడు. కళ్లు లేని తన చెల్లి ఇంట్లో అమ్మా అనుకుంటూ వెతుకుతుంది. తన తండ్రి, తల్లిని చంపేస్తాడు పరసురాం. తరువాత సీన్లో అదే బోన్ ను శుభ్రం చేస్తుంటాడు పరసురాం. అక్కడికి దాస్ వచ్చి పక్కనే ఉన్న తలలను చూసి షాక్ అవుతాడు. బోన్ ను ముక్కగా చేసుకొని చేతికి కట్టుకుంటాడు. తలలను సంచిలో వేసుకొని పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోతాడు. తనకు 14ఏళ్లు శిక్షపడుతుంది. ఇంకో రెండోళ్లలో శిక్షపూర్తి అవుతుంది అనగా దాస్ ను తన మామ దగ్గర పనిలో చేరమంటాడు. తరువాత పరసురామ్ తన మామ దగ్గరకు వెళ్లి తన మా అమ్మానాన్నాలన చంపింది నీ కోసమే అని, నేను ఆస్తి కోసం రాలేదని చెప్తాడు. అలాగే ఈ వయసులో నిన్ను వదిలిపెట్టి వెళ్లిన తన కొడుకు భాను ప్రసాద్ ను తీసుకోస్తా అని అంటాడు. దాంతో అవసరం లేదు నువ్వు ఇంట్లోకి వెళ్లు అని చెప్తాడు రమేష్ ప్రసాద్. అలా ఇంట్లో చోటు దక్కించుకుంటాడు. తరువాత తన ఆస్తి ఒక్కటే కాదు మామ ఆస్తిని కూడా దక్కించుకోవాలని ఆలోచిస్తాడు. అదే సమయంలో పూర్ణిమ పనివాల్లపై పెత్తనం చేస్తుంది. పూర్ణిమ తన మామ ఫ్రెండ్ కూతురు. అతను చనిపోయాక పూర్ణిమను తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేద్దామని ఇంట్లోకి తీసుకొస్తాడు రమేష్ ప్రసాద్. కాని తన కొడుకు భాను అల్ రెడీ పెళ్లీ చేసుకున్నట్లు, తనకు కవలలు ఉన్నట్లు చెప్పడంతో భానును బయటకు గెంటెస్తాడు. దాంతో పూర్ణిమ తన ఇంట్లోనే ఉంటుంది. తనకు పెళ్లి చేయలేదని బాధపడుతుంటాడు. ఆ సమయంలో పూర్ణిమను పెళ్లి చేసుకుంటాడు పరసురాం. నీ కొడుకక్కు ఇచ్చి కొడల్ని చేసుకుందాం అనుకున్నావ్ కాని ఇప్పుడు ఏకంగా నీ కూతుర్నే చేసిన మామ అని అంటాడు పరసురాం. దాంతో సంతోషపడి హగ్ చేసుకుంటాడు. అలా ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు.
దాంతో దాస్.. పరసురాం ఏం చేస్తే అదే చేస్తాడు. తాను కూడా ఇంట్లో పనిచేస్తున్న ఆవిడను పెళ్లి చేసుకుంటాడు. ఇక వాళ్లిద్దరు ప్రెగ్నేన్స్ అవుతారు. ఆ సమయంలో లెక్కల్లో ఏవో తేడాలు వచ్చాయని పూర్ణిమ పరసురాం మీద అరుస్తుంది. అది విన్న రమేష్ కు అనుమానం వచ్చి లాయర్ తో వీలునామ రాయిస్తాడు. వాళ్లకు అనుమానస్పదంగా ఏదైనా జరిగితే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్ కే చెందాలి అని వీలునామ రాస్తాడు. దాన్ని పూర్ణిమ చేతుల పెడుతాడు. ఈ ఘటనతో పరసురాంకు కోపం వస్తుంది. తన తల్లిదండ్రులను చంపినంత మాత్రానా.. ఆస్తి కోసం పెళ్లాన్ని కూడా చంపేస్తానా అని తన మీద తనకు కోపం వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో దాస్ కు కూతురు పుడుతుంది. పరసురామ్ సుసైడ్ చేసుకుంటున్న సమయంలో అక్కడికి తన అసిస్టెంట్ వచ్చి తనకు కూతురు పుట్టిందని, పురిట్లోనే పూర్ణిమ చనిపోయిందని, ఆ బాధతో తన రమేష్ ప్రసాద్ కూడా చనిపోయినట్లు చెప్తాడు. దాంతో వీలునామ చెల్లకుండా పోతుంది. తన అమ్మే కూతురు రూపంలో తిరిగి వచ్చిందని నమ్ముతాడు.
నెక్ట్స్ సీన్లో ఈ స్టోరీ రాస్తున్న దాస్ కు ఫోన్ వస్తుంది. శ్రీలంక వచ్చేశాను, లాడ్జ్ లో ఉన్నా అని పరసురామ్ చెప్తాడు. బోర్డింగ్ పాస్ రెడీ అయిందని గంట ముందు ఎయిర్ పోర్ట్ లో ఉంటే చాలు అని దాసు చెప్తాడు. తన తల్లిఫోటోను చూస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు పరుసురామ్. భానును చంపేస్తే ఇక ఆస్తి గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు అని పరసురామ్ ప్లాన్ చేస్తాడు. దాన్ని ఎగ్జిగ్యూట్ చేయడానికి దాస్ ను పంపిస్తాడు. దూరం నుంచి వారిని చూసిన దాసు షాక్ అవుతాడు. పరసురాంకు ఫోన్ చేసి భాను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు నీ చెల్లి అంజలినే అంటాడు. తాను ఒక్క క్షణం తన చెల్లి గురించి ఆలోచిస్తాడు. వారికి ఇద్దరు కవలలు కూడా ఉన్నారు అని దాస్ చెప్తాడు. అయినా సరే అందరిని చంపేయ్ అని, తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెప్తాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు పక్కనే ఉన్న చెరువలో దూకుతారు. తరువాత బాంబ్ పేలుతుంది. భాను, అంజలి దూరం ఎగిరిపడుతారు. తరువాత పిల్లలు కోసం అంజలి, భాను ఏడుస్తారు. మరో వైపు తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడుస్తుంటారు. కట్ చేస్తే దాస్ ను పరసురాం కొడుతాడు. వారిని వదిలి తప్పు చేశాము అని ఇష్టం వచ్చినట్లు కొట్టి తన బిడ్డదగ్గరకు వచ్చి ఆలోచిస్తాడు. తన కళ్లముందే తన బిడ్డకు ఎలాంటి ఆపద రావద్దు అని దాస్ బిడ్డ స్థానంలో తన బిడ్డను మారుస్తాడు. అదే సమయంలో అక్కడికి దాస్ వస్తాడు. ఈ బిడ్డ ముఖం చూసే నిన్ను చంపకుండా వదిలేసిన, ఈ రోజు నుంచి నా బిడ్డ ఏం చేస్తే నీ బడ్డ కూడా అదే చేయాలి, చదువు కూడా అని చెప్పి దాస్ కు తన కూతుర్ని ఇస్తాడు.
ఆ విషయాన్ని తలచుకొని పరసురాం సంతోషపడుతుంటాడు. అదే సమయంలో దాసు ఫోన్ చేసి అంత రెడీ అయిపోయింది మీరు రండి అని చెప్తాడు. తరువాత దాస్ ఆలోచిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో పరసురామ్ కూతురు పాలు లేక ఏడుస్తుంది. దాంతో బాస్ మీదున్న కృతజ్ఙతో తన కూతుర్ని మారుస్తాడు దాస్. అక్కడికి నర్సు వచ్చి ఏడుస్తున్న పాపకు పాలు పడుతుంది. అక్కడి నుంచి దాస్ వెల్లిపోతాడు. ఇదే విషయాన్ని దాసు ఆలోచిస్తూ నవ్వుకుంటాడు. అలా ఇద్దరు ఆ రహస్యాన్ని తమ డైరీలో రాసుకొని కాల్చిపడేస్తారు. తరువాత పరసురాం ఒక కొత్త ఇల్లును కొంటాడు. అక్కడికి తన కూతుర్లతో వస్తారు. తరువాత ఇద్దరి కూతుర్లు తారు మారు అయ్యారు అని వారు అనుకుంటారు. దాస్ దగ్గర ఉన్న బిడ్డ బాస్ కూతురు అనుకొని గారబంగా చూసుకుంటాడు. పరసరాం దగ్గర ఉన్న పాప దాస్ కూతురు అనుకొని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు పరసురాం. అలా పిల్లలు పెద్దవాల్లు అవుతారు. తరువాత వారు మేజర్ అయినట్లు వారి పుట్టిన రోజున వారిని ఆశీర్వదిస్తారు. దాస్ కూతురు మీనాక్షి కాస్త పద్దతిగా పెరుగుతుంది. పరసురాం కూతురు విశాలాక్షీ మోడర్న్ గా పెరుగుతుంది. తనకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కవాలని రీల్స్ చేస్తుంది. అది చూసి దాస్ పరసురాం మట్లాడుకుంటారు. అది ఇంకా చిన్నపిల్ల అని వివాలాక్షిని పరసురామ్ వెనెకేసుకొస్తాడు. హైదరాబాద్ లో మీనాక్షికి ఉద్యోగం వచ్చిందని మీనాక్షి వెళ్తా అని ఏడుస్తుంది. తరువాత అక్కడికి వెళ్దాం అని పరసురామ్ ఒప్పిస్తాడు.
కట్ చేస్తే మీనాక్షిని తీసుకొని హైదరాబాద్ కు వస్తాడు. హైదరాబాద్ లో ఒక మల్టీ స్పెషల్టీ ఆసుపత్రిని కట్టించబోతున్నట్లు చెప్తాడు. మీనాక్షిని తన కూతురే అనుకుని పరసురాం తన కోసం పక్కనే ఫ్లాట్ తీసుకొని తననే చూస్తూ ఉంటాడు. తనను పికప్ అండ్ డ్రాపింగ్ కూడా తానే చేస్తుంటాడు. తనకు ఇష్టమైన చోటుకు తీసుకెళ్తాడు, ఆటలు ఆడిపిస్తాడు. సంతోషంగా గడుపుతుంటాడు. అలా తన కోసం వెతుక్కుంటూ ఎప్పుడైనా అంజలి కవల కొడుకులు వస్తారని అన్ని అమ్మోసుకొని పారిస్ వెళ్లి పోవాలి అనుకుంటాడు. అలా ఆస్తులను అన్ని సగం రేటుకే పృథ్వీకి అమ్మేస్తాడు. అలా దాసు, పరసురామ్ పారిస్ కు వెళ్లి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. వన్ మంత్ తరువాత డబ్బు రెడీ అయిందని రాజీవ్ కనకాల ఫోన్ చేస్తే డబ్బు తీసుకుని, పిల్లలను కూడా తీసుకురావడానికి ఇండియాకు వస్తాడు పరసురామ్. ఆ సమయంలోనే ఫస్ట్ చూపించిన సీన్ జరుగుంది. పోలీసులు ఆపడం ఫైట్ జరగడం. తరువాత పరసురాం పారీస్ కు వెళ్తాడు. కూతుర్లు ఇండియాలోనే ఉంటారు. వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటారు. అలా 8 నెలలు గడుస్తాయి.
ఒక రోజు గుణ ఫోన్ చేసి మీనాక్షి, విశాలక్షి ఇద్దరు లవ్ లో పడినట్లు చెప్తాడు. ఆ ఇద్దిరిని నరికేయకుండా ఎం చేస్తున్నావ్ అని దాసు అంటాడు. బాస్ వద్దన్నడు అని గుణ చెప్తాడు. తరువాత సీన్లో దాసు పరసురామ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళిద్దరు అన్నదమ్ములు అని వారిద్దరిని ఒకే సారి చంపాలి అని ప్లాన్ చేస్తారు. ఇక వారి ఫోటోలు చూసి దాస్ షాక్ అవుతాడు. వాళ్లిద్దరు పరసురాం చెల్లెలు అంజలి కొడుకులు అని చెప్తాడు. దాస్ చేసిన పని మూలంగానే ఈ పరిస్థితి అని తిడుతాడు. వాళ్ల కోసం పరసురాం ఇండియాకోస్తాడు. వారి డైరీల కోసం గుణను అడుగుతాడు. అందులో దుర్గ డైరీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తాడు. దుర్గ న్యూ ఇయర్ రోజు మందు మానేద్దామని లాస్ట్ బాటిల్ తాగుతాడు. సీసలు అన్ని పగులగొడుతారు. వాళ్ల ఫ్రెండ్స్ లో కన్న లక్కీ డ్రాప్ తాగాడని మళ్లీ స్టార్ట్ చేస్తారు. న్యూయర్ మన తెలుగు పండుగ కాదు ఊగాది నుంచి మానేద్దాం అనుకుంటాడు. తరువాత సీన్లో రూమ్ లో ఫ్రెండ్స్ తో కూర్చొని ఉంటాడు. బీర్ తాగుకుంటూ పచ్చడి నాక్కుంటు విశాలక్షి రీల్స్ చూస్తుంటాడు. అదృష్టం బాగుంటే తనే డోర్ కొడుతుంది అనే సరికి అక్కడికి విశాలక్షి వచ్చి తనను పరిచయం చేసుకొని ఫ్రెండ్స్ అని చెప్తుంది.
తరువాత మీనాక్షి డైరీ తీసుకుంటాడు. దాన్ని ఓపెన్ చేస్తాడు. డీజే నచ్చడానికి కారణం నాన్నాలాగే ఉంటాడు అని చెప్తుంది మీనాక్షి. దానికి విశాలక్షి కూడా దుర్గ కూడా అంతే అంటుంది. అయితే డీజేకి టెస్ట్ లు పెట్టాలని విశాలాక్షి చెప్తుంది. కామాక్షి ఫిక్స్ అవుతుంది.
తరువాత సీన్లో డీజే పని చేసే పబ్ లో కారు ఆపుతాడు గుణ. డీజే వస్తున్నాడు అని చెప్తాడు. అక్కడ మీనాక్షి, డీజే ఇద్దరు నడుసుకుంటు వస్తారు. మీనాక్షి కారు కీస్ నొక్కుతుంది. కారులో ఎక్కి కూర్చుంటాడ పరసురాం. తరువాత డీజేను టెస్ట్ చేయాలని తాను ఒక ప్రయివేట్ పార్టీకి వెళ్తునట్లు చెప్తుంది. డీజే అలా వెల్లద్దు అని వాదిస్తుంటాడు. అక్కడికి రాకేష్ వస్తే తనను డీజేకు పరిచయం చేస్తుంది. తరువాత రాకేష్ ను తీసుకుని కార్లొ వెళ్తుంది. ఈ లోపు ఈ కవలల స్టోరీని చదివేద్దాం అని డైరీస్ తీస్తాడు పరసురాం. సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో దుర్గ, విశాలాక్షి, డీజే, మీనాక్షి మధ్య సాగుతుంది. మినాక్షి టెస్ట్ చేస్తుంది. డీజే విసుగుచెందకుండా తనను బరిస్తుంటాడు. దుర్గ, విశాలాక్షి ఫ్రెండ్స్ లా కలిసిపోతారు.
తరువాత సీన్లో దుర్గ పరుగెత్తుకుంటు వస్తాడు. అక్కడికి వచ్చి సేఫ్టీ అడుగుతాడు. కన్న ఫైటింగ్ అనుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. తరువాత తన ఫ్రెండ్స్ వచ్చి తనుకు సెఫ్టీ ఇస్తాడు. తరువాత అక్కడి నుంచి అది తీసుకొని వెళ్తాడు. రూమ్ కి వెళ్లి తనతో కమిట్ అవుదామని ఏదోదో ఊహించుకుంటాడు. తాను జిమ్ ట్రైనర్ గురించి చెప్తుంది. ఇక ఇద్దరు మందు తాగుతు మాట్లాడుకుంటారు. కేవలం సిక్స్ ప్యాక్ ఉందనే తనను ప్రేమించి నట్లు చెప్తుంది. అదే కోపంతో దుర్గ కన్నాను కొడుతుంటాడు. ఐ హేట్ లవ్ అని అరుస్తాడు దుర్గ. తరువాత సీన్లో డీజే దుర్గతో మాట్లాడుతుంటాడు. అక్కడికి విశాలాక్షిని తీసుకొని మీనాక్షి వస్తుంది. అక్కడ విశాలాక్షి డీజేను టెస్ట్ చేస్తా అంటుంది. తన సిక్స్ ప్యాక్ చూపించమని అడుగుతుంది. దానికి డీజే సిగ్గు పడుతాడు. తరువాత విశాలాక్షి అలుగుతుంది. దాంతో డీజే తన సిక్స్ ప్యాక్స్ చూపిస్తాడు. అది చూసి మీనాక్షి ప్యాక్స్ ను లెక్కపెడుతుంది. అక్కడినుంచి విశాలాక్షి వెళ్లిపోతుంది.
తరువాత మీనాక్షికి సిక్స్ ప్యాక్స్ బాడీ కావాలని అది మన వల్ల కాదని, తన పాపులారిటీ పెంచాలని ట్రై చేస్తాడు. అందుకోసం వైజాగ్ లో ఉన్న హ్యకర్లకు డబ్బులు ఇచ్చి తనను పాపులర్ చేస్తాడు. మీనాక్షి తన అభిమానులతో బిజీగా ఉంటుంది. దుర్గ డిస్సాపాయింట్ అవుతాడు.
తరువాత విశాలక్షి డీజేను టెస్ట్ చేయాలని ఇంటికి పిలుస్తుంది. బ్లాక్ సారీ కట్టుకొని, బాల్కనీలో రోమాంటిక్ అంబియేన్స్ క్రియేట్ చేస్తుంది. డీజేను టెప్ట్ చేయాలని నడుము దగ్గర ఫ్యాట్ ఉందని ఒక సారి చూడమని చెప్తుంది. డీజే ఎలాంటి ఫీల్ లేకుండా ఫ్రోఫెషనల్ గా చెప్తుంటాడు. మీనాక్షి టెప్ట్ అయి తనను దగ్గరకు తీసుకుంటుంది. దాంతో డీజే ఆడ్ గా ఫీల్ అవుతాడు. పెళ్లికి ముందు ఇళాంటివి తప్పు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో ఆ డైరీ చదువుతున్న పరసురామ్ తల మీద కొట్టుకొని డైరీ చదువుతాడు. నెక్ట్స్ సీన్లో దుర్గ, మీనాక్షి ఇద్దరు వైజాగ్ కు ఆర్జీవి వస్తున్నాడు అని ఆయనతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలిని చెప్తుంది. నెక్ట్స్ సీన్లో మీనాహక్షి డీజేతో పార్టీ అరెంజ్ చేసి సడెన్ గా వైజాగ్ కు వెళ్తా అంటుంది. అక్కడినుంచి మీనాక్షి వెళ్లిపోతుంది. తరువాత కారు పక్కకు ఆపీ డ్రెస్ మార్చుకొని పార్టీకి వెళ్ళమని చెప్తుంది విశాలాక్షి. నెక్ట్స్ సీన్లో పబ్ లో విశాలాక్షి, దుర్గ ఆర్జీవి కోసం వెయిట్ చేస్తారు. అక్కడికి ఆర్జీవి వస్తాడు. అతనితో ఇంటర్వ్యూ కోసం విశాలాక్షి కూర్చుంటుంది. తరువాత సాంగ్ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ డీజే, అక్కడ దుర్గ ఇద్దరు సాంగ్ పాడుతుంటారు. డీజే సాంగ్ ఫార్ఫార్మెన్స్ చేసే దగ్గర మాస్క్ పెట్టుకొని మీనాక్షి వెళ్తుంది. సాంగ్ అయిపోగానే దుర్గ విశాలాక్షిని కొడుతాడు. తరువాత సీన్లో పరసురామ్ డైరీస్ ఆగిపోయాయి అని ఆలోచిస్తాడు. అంతలో గుణ ఫోన్ చేసి, దుర్గ జనవరిలోనే చనిపోయినట్లు పోలీసులు నిన్ను ఆరోజు ఆపింది ఆ కేసులోనే, అందరూ నువ్వే దుర్గను చంపావు అనుకుంటున్నారని చెప్తాడు. తరువాత సీన్లో మీనాక్షిని రాకేష్ తన ఫ్రెండ్స్ సెడ్యూస్ చేస్తుంటారు. కార్లో ఉన్న పరసురామ్ చూసి కోపంతో అరుస్తాడు. ఇక్కడ ఇంటర్ మిషన్ పడుతుంది.
మీనాక్షి వారినుంచి తప్పించుకొని పారిపోతుంది. కార్లో నుంచి పరసురాం బయటకు వస్తాడు. మీనాక్షి పారిపోయి దాక్కుంటుంది. మళ్లీ మీనాక్షని తరుముతారు వాళ్లు. అంతలో అక్కడికి కారు వస్తుంది. మీనాక్షి పరుగెడుతుంది. వారి నుంచి తప్పించుకొని పరుగెడుతుంది. దారిలో ఒక కారు వస్తే అందులో ఎక్కి డీజేకు ఫోన్ చేస్తుంది. డీజే దెప్పిపొడిచినట్లు మాట్లాడుతాడు. అక్కడే పరసురామ్ ఉంటాడు. ఐ హేట్ యు డీజే అని ఫోన్ కట్ చేస్తుంది మీనాక్షి. తరువాత సీన్ లో వచ్చిన కారు డీజేది. వారిని కొట్టి కార్లో వేస్తాడు. తరువాత అక్కడ పార్టీ చేసుకుంటున్న ఫ్రెండ్స్ ను కొడుతాడు. అది పరసురామ్ చూస్తుంటాడు. రాకేష్ ను కొట్టి తనకు చెప్పకు అని వార్నింగ్ ఇస్తాడు. అసలు ఏం జరుగుతుంది అని గుణ అడుగుతాడు. దానికోసం తాను డీజే ఇంటికి వెళ్లినట్లు అక్కడ తాను ఫ్యామిలీతో హ్యాప్పిగా ఉన్నట్లు, అసలు దుర్గ విషయంలో ఎవరు బాధ పడట్లేదు అని చెప్తాడు. అలా ఎందుకు అయి ఉంటుంది బాసు అని గుణ అడిగితే అసలు దుర్గ చావలేదు కాబట్టి అని చెప్తాడు. వీల్లే దుర్గను దాచిపెట్టి నాటకం ఆడుతున్నారు అని పరసురాం చెప్తాడు. ఇక దుర్గను బయటకు లాగలంటే ఒక దాసు గాడి వల్లనే అవుతుంది అని అతన్ని ఇండియా రంపించాలి అని గుణతో చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో పృథ్వీ ఎస్ఐతో మాట్లాడుతాడు. 800 కోట్ల ఆస్తీ 300 కోట్లకు వచ్చిందని ఆశగా ఉండింది, ఆ 300 కోట్లు కూడా మనమే నొక్కిస్తే బాగుంటుందని దాని చెప్పి ప్లాన్ చేస్తాడు. పరసురామ్ ను చంపినా, వాడే చంచినా డౌటు మనమీదకే వస్తుందని అదే ఒక మర్డర్ ను వాని మీద వేస్తే మనకు డబ్బు వాడికి చిప్పకూడు అని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగానే పబ్ లో విశాలాక్షిని కొట్టిన దుర్గను కిడ్నాప్ చేయించి చంపాలని చూస్తే.. వాడు మనవాళ్లనే కొట్టి తప్పించుకున్నాడు అని చెప్తాడు.
తరువాత సీన్లో పారీస్ లో ఉన్న దాస్ గుణతో ఫోన్ మాట్లాడి ఇండియాలో దిగుతాడు. అతను కార్లో ఎక్కగానే క్లోరోఫామ్ కొట్టి అతను సృహతప్పేలా చేస్తాడు గుణ. తరువాత సీన్లో డీజే పై ఎటాక్ చేయడానికి కొంతమంది వస్తారు. ఎవరా అని చూసే లోపే పరసురామ్ డీజేకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెడుతాడు. అక్కడికి వచ్చిన గుండాలు దాసు అని పరసురాంను పిలుస్తారు. తాను దాస్ గా పరిచయం చేసుకొని డీజేతో మాట్లాడుతాడు. దుర్గ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఇక మీ ఫ్యామిలీ గురించి నీకు చాలా విషయాలను చెప్పాలని అందరిని ఒక చోటుకు తీసుకురావలని చెప్తాడు. కట్ చేస్తే అందరిని తీసుకొని డీజే ఒక అపార్ట్ మెంట్ కు తీసుకొస్తాడు. అక్కడ దాస్ ను చూపించి ఇతడే పరసురాం అని, అతను చేసిన పాపలకు చంపేయండి అని చెప్పి కత్తి చేతికి ఇస్తాడు. దాంతో అంజలి తనను చంపాల్సిన అవసరం లేదు అతన్ని ఆసపత్రికి తీసుకువెళ్లండి, బాగా అయిన తరువాత ఇంటికి తీసుకురండి అని చెప్తుంది. పరసురాం షాక్ అవుతాడు.
తరువాత వాళ్ల మీద ఎటాక్ చేసింది పరసురామ్ కాదని భాను తండ్రి రమేష్ ప్రసాద్ అని అంజలి చెప్తుంది. దీంతో పరుసురామ్ తనమీద తానే చిరాకు పడుతుంటాడు. ఇక దుర్గను చంపినందుకు కూడా పరసురాం మీద కోపం వస్తలేదా అని అంటాడు. ఇన్ని సార్లు మీరు అడుగుతున్నారు అని దుర్గ అసలు చనిపోలేదు అన్న విషయం డీజే చెప్తాడు. ఎక్కడున్నాడు అని పరసురామ్ అడుగుతాడు. దానికి డీజే పరసురామ్ ముందుకు వచ్చి నిలబడుతాడు. తానే దుర్గ, తానే డీజే అని చెప్తాడు. ఇక డైరీల విషయంలో కూడా కన్ఫూజన్ లేకుండా ఒక సిక్స్ మంథ్స్ ఫాస్ట్ గా మీనాక్షిని రాయమన్నట్లు చెప్తాడు. సో వైజాగ్ లో విశాలాక్షితో, హైదరాబాద్ లో మీనాక్షితో ప్రేమలో ఉంది డీజేనే. దుర్గ ఫ్రెండ్ గా ఉన్న అనిల్ తన రెండో కొడుకు అని చెప్తుంది. దీంతో సినిమాలు చూసి పాడువుతున్నారని, పోలీకలు లేని కవల పిల్లలు కూడా ఉంటారు అని చెప్తుంది అంజలి. ఇక ఆనాధశ్రామాలను పృథ్వీరాజ్ దత్తత తీసుకోవడం వల్ల వైజాగ్ కు వారు వచ్చినట్లు, అదే ఆనాదశ్రమంలో తమ పిల్లలను కలిసినట్లు చెప్తుంది. అలా తాము కుటుంబంలా కలిసిపోయినట్లు చెప్తుంది. దాంతో పరసురామ్ వెర్రిగా నవ్వుతాడు. ఎందకంటే ఆ ఆనాధశ్రమాలను దత్తత తీసుకొమ్మని పృథ్వీకి సలహ ఇచ్చింది పరసురామే. ఇక వాల్ల అన్నయ్య మీద ఎలాంటి ద్వేషం లేదని చెప్తుంది అంజలి.
దాంతో దాసును ఇప్పుడే లేపద్దు అని ఇకపై మామా మశ్చీంద్రా ఏంటో చూపిస్తా అని చెప్తాడు. తరువాత సీన్లో మీనాక్షి డ్యాన్స్ చేస్తుంది. విశాలక్షి యోగ చేసుకుంటుంది. అదే సమయంలో కారులో స్పీడ్ గా పరసురాం దిగుతాడు. వారిని ప్రేమగా హగ్ చేసుకుంటాడు. మీనాక్షిపై ఎక్కువ ప్రేమా చూపిస్తాడు. విశాలక్షిపై తక్కువ ప్రేమ చూపిస్తాడు. తరువాత సీన్లో దాసు పరుసురామ్ మాట్లాడుకుంటారు. పేర్లు మార్చిన అనుమానం కూడా వాళ్లకు రాలేదా అని అడుగుతాడు. రాలేదు అని, డీజేను మీనాక్షికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. దానికి దాసు ఓకే అని చెప్తాడు. దాసు అంటే పరసురామ్ కోపం.. తన కూతురికి డీజే కావాలా అని, మీనాక్షి నా కూతురే కదా అని ఫీల్ అవుతాడు. తరువాత సీన్లో అనిల్, డీజే మాట్లాడుకుంటారు. మీనాక్షిని పెళ్లి చేసుకోవడం కన్నా విశాలాక్షే బెట్టర్ అని చెప్తాడు. అదే టైమ్ లో మీనాక్షి, విశాలాక్షి కూడా అలానే మాట్లాడుకుంటారు.
నెక్ట్స్ సీన్లో పరసురాం ఇంటికి వస్తాడు. భానును మెమరీ థెరఫీకి తీసుకువెళ్లడానికి వెళ్తుంది అనిల్ వైఫ్. ఇక ఇంట్లోకి వెళ్లి మీనాక్షితో పెళ్లి చేద్దాం అని అంటాడు. దాంతో దుర్గ ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాళ్ల అన్నయ్యను మీ అమ్మ కలువాలంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. తరువాత పెళ్లికి ఒప్పించి సంతోషంగా వెళ్లిపోతాడు.
కట్ చేస్తే ఇంటికి వస్తాడు పరసురామ్. అక్కడ మీనాక్షి చీరకట్టుకొని వచ్చి ఎలా ఉన్నాను అని అడుగుతుంది. మా అమ్మలా ఉన్నావు అని చెప్తాడు. తరువాత నువ్వే విశాలాక్షివి నిన్ను చిన్నప్పుడు మార్చాను అని జోక్ చేస్తాడు. తరువాత డీజేతో పెళ్లి గురించి మాట్లాడుతాడు. మీకెలా తెలుసు అని అడుగుతుంది. దానికి డైరీ చేతులో పెడుతాడు. మీనాక్షి ఎమోషన్ అవుతుంది. బయటకు వచ్చి పరుసురామ్ డ్యాన్స్ చేస్తాడు. అంజలి దోశలు వేస్తూ… నీ సంతోషమే ముఖ్యం అని, నీకు నచ్చితేనే చేసుకో అని డీజేతో చెప్తుంది. దాంతో ఇటు మీనాక్షి, అటు డీజే ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఎలాగైనా విశాలక్షితో డీజే రూమ్ లాక్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు.
బర్త్ డే పార్టీ కోసం డీజే మీనాక్షి ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో గుణ చూసి దాసుకు ఫోన్ చేసి, పిల్లలు మందు పార్టీ చేసుకుంటున్నారు అని చెప్తాడు. దానికి దాసు నమ్మడు ఫోన్ పెట్టేస్తాడు. గుణను చూసిని విస్సు, మీనాలు గుణను పార్టీకి ఉండండి అని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో గుణ కూడా వాళ్లతో పార్టీలో జాయిన్ అవుతాడు. వాళ్లకు హర్బల్ జ్యూస్ ఇస్తాడు. దాన్ని కూడా తాగకుండా పారబోస్తారు. మత్తెక్కినట్లు నటిస్తారు. ఇక్కడ జరిగేది పరసురామ్ బైనాక్యూలర్ తో చూస్తారు. వీరు డ్యాన్స్ చేస్తుంటారు. సాంగ్ అయిపోతుంది. విశాలక్షి, డీజే ఇద్దరు ఒకే రూమ్ లోకి వెళ్తారు. వాళ్ల తాగలేదని వాళ్లకు అర్థం అవుతుంది. వారు కిస్ చేసుకోబోయే టైమ్ కు దుర్గ అని పిలుస్తాడు పరసురామ్. ఇద్దరు బయటకు వస్తారు. తానే డీజే, తానే దుర్గ అని చెప్తాడు. దాంతో విశాలక్షి ఎందుకు ఆడుకున్నావ్ అని డీజేను పట్టుకొని అరుస్తుంది. దాంతో డీజే ఎమోషనల్ గా మాట్లాడుతాడు. తరువాత మినాక్షి కోసం నన్ను ఇలా వాడుకోవడం తప్పు అని చెప్తుంది. డీజే వెళ్లిపోతాడు.
తరువాత విశాలాక్షి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. తనేమన్నా చేసుకుంటుందో ఎమో అని దాసు భయపడుతుంటాడు. చేసుకుంటే చేసుకొనియు తాను నా బిడ్డ కాదు నీ బిడ్డ అని పరసురాం అంటాడు. పిల్లలను మార్చిన విషయం చెప్తాడు. దాంతో దాసుపై తనకున్న కక్ష్యను కూడా చెప్తాడు. అదే టైమ్ లో ఎమోషన్ అయిన దాసు తాను కూడా పిల్లలను మార్చినట్లు చెప్తాడు. కాకపోతే నీలా శిక్షించాలని కాదు, రక్షించాలని మార్చినట్లు చెప్తాడు. అదే సమయంలో విశాలాక్షి సెంట్ తాగి కింద పడి బ్లడ్ కక్కుతుంది. తనను ఆసుపత్రిలోకి తీసుకుపోతాడు పరసురాం. తనకు అవుట్ ఆఫ్ డేంజర్ ఉందని డాక్టర్స్ చెప్తారు. తరువాత పృథ్వీకి కాల్ చేసి కొందరిని చంపమని చెప్తాడు పరసురామ్. అందరిని చెప్పిన చోటుకు తీసుకురా అని అంటాడు. కట్ చేస్తే డీజే ఫ్యామిలీని కట్టేస్తాడు పృథ్వీ. వాళ్లతో పాటు దాసు కుటుంబాన్ని కూడా ఉంటుంది. అక్కడికి పరసురామ్ వస్తాడు. కుర్చిలో కూర్చుంటాడు. వీళ్లను చంపేస్తా అని పృథ్వీ అంటాడు. పరసురాం తన కూతురు విశాలాక్షితో మాట్లాడుతాడు. తనను ప్రేమగా హగ్ చేసుకుంటాడు. మీనాక్షి విశాలాక్షి ఒకటి కాదు అంటుండగా తన కూతురు అడ్డు పడి, తనను అమ్మా అని పిలిచావు, ఒక్క సారి అలా పిలిస్తే తాను ఎప్పటికి అమ్మే అని చెప్తుంది. అలాగే ఇప్పుడు నేనే నీ కూతురు అని నమ్ముతున్నావు రేపు కాదు అని ఇంకోకరు చెప్తే నన్ను కూడా చంపేస్తావా అని ఏడుస్తుంది. దాంతో పరసురామ్ కూడా కరిగిపోతాడు. ఇదే విషయాన్ని వాళ్లందరితో చెప్పి అత్యశతో లేనిపోని వాటిని ఊహించుకొని ఇన్నాల్లు తప్పు చేశానని, క్షమించమని చెప్పి అక్కడినుంచి డబ్బు విసిరేసి వెళ్లిపోతాడు. మీనాక్షి ఆపాలని చూస్తుంది. దానికి అంజలి తనను ఆపి.,. వెళ్లనివ్వు అమ్మా.. తనన తాను వెతుక్కుంటూ వెళ్తున్నాడు దొరక్కానే మళ్లీ తిరిగి వస్తాడు అని చెప్తుంది. అలా తన కోర్టును, డబ్బులను వదిలేసి వెళ్లిపోతాడు. ఒక చోట బెంచ్ పైన పడుకుంటాడు. అక్కడికి వాళ్ల అమ్మ వచ్చి తల నిమురుతుంది. అమ్మా అని అంటాడు మీనాక్షిలా కనిపిస్తుంది.