పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. త్వరలో నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారని కూడా వెల్లడించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అనుచరులు ఆసుపత్రి వద్ద భారీగా చేరుకున్నారు.