»Ktr Is Afraid Of Defeat Congress Leaked The Audio Of The Phone Call
KTR Phone Call: కేటీఆర్కు ఓటమి భయం.. ఫోన్ కాల్ ఆడియో లీక్ చేసిన కాంగ్రెస్!
మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. సిరిసిల్లలో కేటీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, తన సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి కేటీఆర్ భయపడుతున్నారని విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) వేళ నేతల మధ్య విమర్శల పర్వం నెలకొంది. మాటల యుద్దం నడుస్తోంది. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. కేటీఆర్ (KTR) తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లేందుకు వెనకాడుతున్నారని, నాయకులకు ఫోన్లు చేసి బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ (Congress Party) ఎద్దేవా చేసింది.
కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCRpic.twitter.com/PXOvRujqt4
సిరిసిల్లలో కేటీఆర్ (KTR)కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ షేర్ చేసిన కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియో (Ktr Phone call Audio Leak)లో..సిరిసిల్ల నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం (Elections campaign)పై అప్రమత్తం చేశారు. రాష్ట్రం అంతా సిరిసిల్ల వైపు చూస్తోందని, వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊర్లో, ఏ బూత్ వాళ్లు ఆ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.
వారం రోజులు కష్టపడి పార్టీ కార్యకర్తలంతా ప్రచారంలో పాల్గొనాలని కేటీఆర్ (KTR) తెలిపారు. ఎవరి మాటలను పట్టించుకోకుండా కౌన్సిలర్లు, సర్పంచులు, బీఆర్ఎస్ అభిమానులు అంతా కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. మెజార్టీ తగ్గుతుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకుని మాట్లాడొద్దని నాయకులకు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ మాట్లాడిన ఈ ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ పార్టీ (Congress Party) నెట్టింట షేర్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.