woman complaints on a man to collector in palvancha
ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా అని ఓ మహిళకు మాటిచ్చాడు. మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేశాడు. ఇద్దరూ కొన్ని రోజులు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ మహిళను పక్కన పెట్టడం ప్రారంభించాడు అతడు. పెళ్లి చేసుకో అంటే మాట దాటేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక తన గోడును కలెక్టర్ కు విన్నవించుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది.
పాల్వంచలో నివాసం ఉండే ఓ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తను ఒంటరిగా ఉంటోంది. ఆమెతో పాటు పని చేసే సాధిక్ తనతో పరిచయం పెంచుకున్నాడు. అతడికి పెళ్లి అయినా కాలేదని అబద్ధం చెప్పి ఆ మహిళకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకో అంటే చేసుకోనంటూ తెగేసి చెప్పేశాడు. గత ఐదేళ్లుగా ఎన్నిసార్లు వేడుకున్నా పెళ్లి చేసుకోవడం లేదని ఆ మహిళ చివరకు కలెక్టర్ ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ ను వేడుకుంది. అతడికి ఇదివరకే పెళ్లి అయిందని.. ఆ విషయం దాచిపెట్టి తనను మోసం చేశాడని, తగిన శిక్ష విధించాలని ఆమె కలెక్టర్ ను కోరింది.