టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్‌లో కివీస్ బౌలర్లపై రోహిత్- గిల్ ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శుభ్‌మన్ గిల్ సెంచరీ బాదాడు. సెంచరీ చేసిన వెంటనే రోహిత్ శర్మ ఓటయ్యాడు. 101 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. 112 పరుగులు చేసిన తర్వాత గిల్ కూడా ఔటయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్ వాష్ చేయాలని అనుకుంటోంది. ఇవాళ్టి వన్డేలో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలించడం, స్టేడియం కాస్త చిన్నగా ఉండటంతో ఫోర్ల వరద, సిక్సర్ల వాన కురుస్తోంది.