OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
ప్రతివారం థియేటర్ లోకి ఏ సినిమా అడుగుపెడుతుందా అని చూసేవారు ఎంత మంది ఉన్నారో... ఓటీటీకి ఎన్ని సినిమాలు వస్తాయి..? ఎందులో వస్తాయి అని ఎదురుచూసేవారు కూడా అంతే ఉంటారు.
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏమున్నాయో ఓసారి చూద్దాం.
ఓపెన్హైమర్:
ఈ హాలీవుడ్ మూవీ ఈ సంవత్సరం బాక్సాఫీస్ హిట్లలో ఒకటిగా నిలిచింది. నవంబర్ 22 నుంచి బుక్ మై షోలో ప్రసారం కానుంది.
పులిమడ:
ఈ మలయాళ చిత్రంలో జోజు జార్జ్ , ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఈ నెల 23 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.
స్క్విడ్ గేమ్: ఈ సీరిస్ నెట్ ఫ్లెక్స్ లో ప్రసారం కానుంది. ఈ మూవీ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్రాన్ టురిస్మో: ఈమధ్య కాలంలో ఈ మూవీ మంచి రేటింగ్ పొందింది. కార్ రేసింగ్ పై విడుదలైన సినిమాల్లో ఇది కూడా ఒకటి. నవంబర్ 25 నుండి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.
మరి వీటిలో ప్రేక్షకులకు ఏది బాగా నచ్చుతుందో చూడాలి. ఈ వారం అయితే తెలుగులో కొత్తగా ఎలాంటి వెబ్ సిరీస్ లు రావడం లేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓటీటీకి వచ్చింది. లియో సినిమా త్వరలోనే ఓటీటీకి రానుంది.