»Bollywood Actress Banita Sandhu Joined In Adivi Sesh G2 Movie
Adivi Sesh: G2లో బాలీవుడ్ నటి బనితా
అడివి శేష్ తన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గూఢచారి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ సిక్వెల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. G2లో బాలీవుడ్ నటి యాక్ట్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Bollywood actress Banita Sandhu joined in Adivi Sesh G2 movie
అడివి శేష్(Adivi Sesh) నటించిన తెలుగు చిత్రం “గూఢచారి” సీక్వెల్ “జీ 2” నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో గ్లోబల్ నటి, మోడల్ బనితా సంధు(Banita Sandhu) ప్రధాన పాత్రలో యాక్ట్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో అడివి శేష్ తన X ఖాతాలో ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు ఓ ట్వీట్ చేశారు. బనితాను ‘G2’ ప్రపంచానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని.. నేను అద్భుతమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నానని శేష్ వెల్లడించారు.
A special surprise this morning! Team #G2 is happy to welcome the fabulous #BanitaSandhu on board.
అంతేకాదు ఈ చిత్రంలో ఎంపికైనందుకు బనితా కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇది తన మొదటి పాన్-ఇండియా చిత్రమని… ఇటువంటి అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడానికి తాను చాలా సంతోషిస్తున్నానని వెల్లడించింది. బనితా సంధు బాలీవుడ్ నటి. ఆమె హిందీ చిత్రం “అక్టోబర్”, తమిళ చిత్రం “ఆదిత్య వర్మ”లో నటించింది. ప్రస్తుతం “G2″తోనే ఆమె తెలుగులోకి అరంగేట్రం చేస్తుంది. ఇక ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.