తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఉ.11:30కి సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం సొరేన్ హాజరుకానున్నరు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీ ఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది. రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్, మజీద్ కూడా నిర్మిస్తున్నారు.