Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్లపై కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసి దోచుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడినట్లు గుర్తు చేశారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
Rahul Gandhi Suggest Revanth Reddy As A CM Candidate
తెలంగాణలో రైతుబంధు స్కీం ద్వారా ఒక్కో ఎమ్మెల్యే ప్రతి ఏటా రూ.3 లక్షలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) అన్నారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని తన ఇంట్లో వేసుకున్నారని ఆరోపించారు. కంట్రాక్టులకు కక్కుర్తి పడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పుడు పగుళ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ దే అంతిమ బాధ్యత అని రాహుల్ అన్నారు. వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీటింగ్లో రాహుల్ పాల్గొన్న క్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సురేఖ, కొండా మురళీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇకపై తెలంగాణలో బీజేపీ కనిపించదని రాహుల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ అనేక మంది భూములు లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని..కానీ కేసీఆర్(KCR) చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు కట్టించింది కూడా కాంగ్రెస్సేనని రాహుల్ అన్నారు. ఐటీ క్యాపిటల్ నిర్మించిన ఘనత కూడా కాంగ్రెస్ దే అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ప్రతి పేద మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని..రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.