»Mallikarjun Kharge Comments On Cm Kcr Farmhouse Setup Ready For Retired
Mallikarjun kharge: KCRకు ఓటమి ఖాయం..ఫాంహౌస్లో విశ్రాంతికి ఏర్పాట్లు ఖర్గే
తెలంగాణలో సీఎం కేసీఆర్ పదవీ విరమణకు సిద్ధమని అంటున్నారని, ప్రజలు కూడా ఆయన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు.
mallikarjun kharge comments on cm kcr farmhouse setup ready for retired
తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, మంచి పురోగతిని అందించడానికి కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(mallikarjun kharge) శుక్రవారం అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు పదవీ విరమణ సమయం వచ్చిందని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన హామీలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనట్లు వ్యాఖ్యానించారు. ఈ విధంగా రెండు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణలో గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు ఆలస్యంగా గుర్తించారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీర్(CM KCR) ఫాం హోస్లో విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిపారు.
LIVE : Congress party’s Manifesto launch for Telangana
ఇప్పటికే తాము కర్ణాటకలో హామీ ఇచ్చి అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. బస్సులో ఉచిత ప్రయాణం కారణంగా కర్ణాటకలోని మహిళలు ఏ మతానికి చెందినవారైనా వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆ హామీలను హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టో మనకు గీత, ఖురాన్ లేదా బైబిల్ లాంటిదని ఖర్గే అన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే మొత్తం ఆరు హామీల అమలుకు ఆమోదం తెలుపుతామని చెప్పారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో మోడీ, కేసీఆర్ కలిసి ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణకు ఆరు హామీలు, విభిన్న ప్రకటనలతో కూడిన కాంగ్రెస్ పార్టీ(congress party) మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం విడుదల చేశారు. 42 పేజీల మేనిఫెస్టో ‘అభయ హస్తం’పేరుతో విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.