»Today Bhagyanagaram Is Full Of Joy Everything Is Ready For The Sadar Festival
Sadar festival : నేడు దద్దరిల్లనున్న భాగ్యనగరం.. సదర్ పండుగకు సర్వం సిద్ధం
సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు భాగ్యనగరం ప్రసిద్దిగాంచింది.
సదర్ పండుగ(Sadr festival)కు భాగ్యనగరం సిద్ధమైంది.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్ ఉత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్బంగా జరిపే ఖైరతాబాద్ (Khairatabad) ప్రసిద్దిగాంచింది. మొత్తం యాదవుల డోలు సప్పుల్లతో, దున్నపోతుల (Ploughing) నృత్యాలతో దద్దరిల్లనుంది. ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, చౌదరి యాదయ్య యాదవ్ అండ్ బ్రదర్స్ సంయుక్తంగా ఈ రోజు సదర్ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ చౌరస్తా నుంచి, రైల్వే గేట్ (Railway Gate) మార్గంలో ఈ ఊరేగింపు నిర్వహించేందుకు ఈసీ (EC) అనుమతించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సదర్ ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
కాగా దున్నపోతులను ఉత్సవాలకు తీసుకువచ్చే నిర్వాహకులు కచ్చితంగా ఈ నిబంధనలను పాటించాలని వారు కోరారు. కాగా ఈ కార్యక్రమంలో యావత్ నగరంలో ఉన్న యాదవ సంఘం (Yadava community) నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ముస్తాబవుతున్నారు. కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి,చప్ప ల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగి, ఓల్డ్‌సిటీ (Old City) తదిరత ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సిటీలో మొదటిసారిగా 1946లో సదర్ వేడుకలను చౌదరి మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. నిజాం కాలంలో గొల్ల, కురుమలు పశుసంపదపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవారు. తమ పశు సంపదను ప్రదర్శించడమే సదర్ వేడుక ప్రారంభానికి వేదికైంది. సదర్ వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటాయి. యాదవులందరూ జోష్చేస్తారు.