»Dhonis Autograph On Fans Car Bmw Video Goes Viral
MS Dhoni : అభిమాని బీఎండబ్ల్యూ కారు పై ధోని ఆటోగ్రాఫ్.. వీడియో వైరల్
తాజాగా ఓ అభిమానికి చెందిన నూతన బీఎండబ్ల్యూ కారుపై మహేంద్ర సింగ్ ధోనీ ఆటో గ్రాఫ్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ(MS Dhoni)కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఏం చేసినా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అతనికి సంబంధించిన ప్రతీ వీడియో వైరల్ అవుతుంది. ధోనీ సారధ్యంలో టీమిండియా అనేక అద్బుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ (World Cup) నుసైతం కైవసం చేసుకుంది. ధోనీ ఆటతీరు, ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయిన తరువాత ఐపీఎల్ (IPL) లో ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. ధోనీ అభిమాని ఒకరు బీఎండబ్ల్యూ(BMW) కారు కొన్నారు. దానిపై తన ఆటోగ్రాఫ్ చేయాలని ధోని కోరాడు. అందుకు ధోనీ సమ్మతించాడు. కారు వెనుక సీటులో కూర్చొని ఎంతో జాగ్రత్తగా దానిపై తన సంతకం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా(Social media)లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘మహేంద్రా సింగ్ ధోనీ మీరెంతో గోప్పవాళ్లో’ ‘ధోనీతో సంతకం చేయించుకున్నారు. మీరు ఎంతో లక్కీ’ ‘మాహీ మీ ఆటను ఎంతో మిస్ అవుతున్నాం’ అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది