»Janakipuram Sarpanch Navya In Station Ghanpur Constituency
Sarpanch Navya : స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్ నవ్య
సర్పంచ్ నవ్య తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు.
జానకీపురం సర్పంచ్ నవ్య (Sarpanch Navya) స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ల పర్వానికి నిన్న ఆఖరి రోజు కావడంతో నవ్య భర్తతో కలిసి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ (CM KCR) తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్పూర్(Station Ghanpur)లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని గతంలో నవ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నామినేషన్ వేసి ఇండిపెండెంట్ (Independent) అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన నామినేషన్ (Nomination) వెనుక ఎవరి హస్తం లేదన్నారు. ఎవరి మీద తమకు కోపం, పగ లేవన్నారు. కేవలం రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నామినేసన్ వేసినట్లు చెప్పారు.
రాజ్యాంగం (Constitution) అందరికి సమాన హక్కులు కల్పించిందని, అవి మహిళలకు వర్తిస్తాయని అన్నారు. ప్రజలు కూడా వంద శాతం రాజకీయాల్లోకి రావాలని.. అందుకే తాను పోటీ చేసేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. ముందు తాను ఓ వార్డు మెంబర్ (Ward Member) గా గెలిచానని, ఇప్పుడు సర్పంచ్‌గా ఉన్నట్లు చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే అయ్యేందుకు నామినేషన్ వేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తున్నానని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వంద శాతం అందరికీ సమాన హక్కులుంటాయని.. అవి మహిళలకు కూడా వర్తిస్తాయన్నారు.
ప్రజలు కూడా వంద శాతం రాజకీయాల్లోకి రావాలని.. అందుకే తాను పోటీ చేసేందుకు ముందుకొచ్చానన్నారు. ప్రజలంతా తనను ఓ చెల్లిలా, అక్కలా, కుటుంబ సభ్యురాలిలా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో తాను అన్ని గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, తనను ఆశీర్వదించి గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సర్పంచ్ నవ్య. ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గతంలో సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు.