అన్నమయ్య: వాల్మీకిపురం సమీపంలోని మంచూరు గ్రామంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. చంద్రమ్మ అనే మహిళ పొలంలో పని చేస్తుండగా చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి ఆమెను మోసం చేశాడు. అనంతరం మెడలో ఉన్న తాళిబొట్టును లాక్కొని, మరో వ్యక్తితో కలిసి బైక్పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.