రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ యాక్ట్ చేసిన 25వ చిత్రం జపాన్. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈరోజు (నవంబర్ 10) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ మూవీలో నటుడు కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, విజయ్ మిల్టన్, తెలుగు నటుడు సునీల్ యాక్ట్ చేశారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
సినిమా: జపాన్ నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, తదితరులు దర్శకత్వం: రాజుమురుగన్ ప్రొడక్షన్ హౌస్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్ సంగీతం: జివి ప్రకాష్ కుమార్ కొరియోగ్రఫీ: శాండీ, జాని విడుదల తేదీ: నవంబర్ 10, 2023
కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ యాక్ట్ చేసిన తాజా చిత్రం జపాన్. క్రేజీ టైటిల్ తో వచ్చిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. దీంతోపాటు కార్తీ లుక్స్, ఫైట్స్ కూడా అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో నేడు(నవంబర్ 10)న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్టా, ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కథ
ఈ చిత్రంలో కార్తీ పేరు జపాన్. కార్తీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ క్రమంగా పెద్ద దొంగగా ఎదుగుతాడు. ఆ క్రమంలోనే జపాన్ కు మంచి డీల్ లభిస్తుంది. అది సక్సెస్ అయితే లైఫ్‌లో మంచిగా సెటిల్ కావచ్చని అనుకుంటాడు. అయితే అది ఓ రాజకీయ నాయకుడైన మంత్రి ఇంట్లో డబ్బులు దొంగిలించే డీల్. అందుకోసం జపాన్ సిద్ధమై 200 కోట్ల రూపాయల విలువైన నగలను చోరీ చేస్తాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అదే ఇంట్లో ఒక మర్దర్ కూడా జరుగుతుంది. ఆ క్రమంలో ఆ మర్డర్ చేసింది జపాన్ అని పోలీసులు భావించి అతన్ని వెతకడం ప్రారంభిస్తారు. అది తెలిసిన జపాన్ తప్పించుకుంటాడు. అయితే అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చివరకు ఏమైంది? అక్కడ దొంగతనం చేసిన తర్వాత జపాన్ ఎక్కడికి వెళ్లాడు? అనేది తెలియాలంటే మాత్రం పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
ఈ సినిమాలో కార్తీ యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో కార్తీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. దీంతోపాటు అతని చమత్కారమైన వాయిస్, డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తాడు. ఈ సినిమాలో కార్తీని పలు రకాల గెటప్ లలో చూపించారు. మరోవైపు ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ అందంగా కనిపించింది. దీంతోపాటు తన గ్లామర్ డోస్ ను కూడా పెంచేసింది. కానీ ఆమె నటనకు పెద్దగా స్కోప్ ఉన్నట్లు అనిపించదు. ఇక సునీల్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అయితే ఇక్కడ విచారణ అధికారిగా విఫలమవుతాడు. దీంతోపాటు మిగిలిన తారాగణం కూడా వారి క్యారెక్టర్ల పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు రాజు మురుగన్ ఈ చిత్రంలో మ్యాచింగ్ ఐడియాలతో సినిమాను తెరకెక్కించాడు. కానీ ప్రొసీడింగ్స్‌ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఫైనల్ గా స్టోరీ, న్యారేషన్ విషయం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక సంగీతం విషయంలో జీవీ ప్రకాశ్ బీజేఎం పర్వాలేదు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. అయితే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా.. నిర్మాణ విలువలు బాగున్నాయి.