»Tdp Complaint To Police Against Ram Gopal Varma At Mangalagiri Rural Ps
Ram gopal varma:పై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ramgopal varma)పై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం చిత్రం(vyuham movie)లోని ట్రైలర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కించే పరిచే విధంగా సీన్లు, డైలాగ్స్ రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఉన్నాయని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
tdp complaint to police against ram gopal varma at mangalagiri rural ps
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ramgopal varma)పై టీడీపీ రీసెర్చ్, కమ్యూనికేషన్ కమిటీ సభ్యుడు గంగాధర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు(complaint) చేశారు. వర్మ దర్శకత్వం వహిస్తున్న వ్యూహం చిత్రం ట్రైలర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కించేపరిచే విధంగా సీన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకరమైన పదజాలం ఉందన్నారు. అంతేకాదు పాటల్లో కూడా కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని ప్రస్తావించారు. అయితే ఈ చిత్రం ఎక్కువగా ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను విమర్శించే సీన్లు ఉన్నాయని గంగాధర్ తన ఫిర్యాదులో వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో ఈ చిత్ర డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతోపాటు నిర్మాత దాసరి కిరణ్, నటీనటులపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంకోవైపు వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రం(vyuham movie) నవంబర్ 10న విడుదల కావాల్సింది వాయిదా పడింది. ఈ సినిమా అనివార్య కారణాలతో సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీకి పంపబడింది. సినిమాను ఆపేందుకు ఎన్ని వ్యూహాలు పన్నినా తన పోరాటంలో విజయం సాధిస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే వర్మ తెలుగు సినిమా ‘వ్యూహం’కి సర్టిఫికేట్ ఇవ్వవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ప్రాంతీయ అధికారికి నారా లోకేష్ లేఖ రాసిన తర్వాత ఇది జరిగింది. సినిమా ట్రైలర్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తన తండ్రి చంద్రబాబు నాయుడును కింగ్‌పిన్‌గా పేర్కొన్నారని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమాయకుడిగా చిత్రీకరించారని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.