»Kohli Who Equaled Sachins Record Is A Birthday Treat For Fans
Virat Kohli : సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ..ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్
విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును సమం చేసినట్లైంది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీ (ODi World Cup)లో నేడు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా (Team India) తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli) అద్భుత సెంచరీ చేశాడు. సచిన్ (Sachin) రికార్డును సమం చేశాడు. బర్త్ డే రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో అభిమానులు, క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన రికార్డులను భారతీయ క్రీడాకారులే అధిగమించాలని కోరుకుంటున్నట్లు ఈ మధ్య క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సచిన్ 49 వన్డే సెంచరీలు చేశాడు.
Virat Kohli equals the legendary Sachin Tendulkar on his birthday!
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచరీ (Kohli Century) చేయాల్సి ఉంది. అయితే సచిన్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోహ్లీ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. 12 పరుగులతో సెంచరీ పూర్తవుతుందన్న తరుణంలో కోహ్లీ ఔట్ అయ్యాడు. అయితే నేడు బర్త్ డే సందర్భంగా అభిమానులంతా కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకున్నారు. ఫ్యాన్స్ కోరుకున్న విధంగా వారికి కోహ్లీ బర్త్ ట్రీట్ ఇచ్చాడు. 49వ సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేశాడు.
119 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. బర్త్ డే రోజు ఈడెన్ గార్డెన్లో సెంచరీ చేసి మరో రికార్డును నెలకొల్పాడు. దీంతో స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇకపోతే శ్రీలంక మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది సంవత్సరాల్లో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసి సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ తన కెరీర్2లో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
నేడు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా (South Africa) ముందు 327 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 40 పరుగులు, గిల్ 23, కోహ్లీ 101, శ్రేయస్ అయ్యర్ 77, కెఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ యాదవ్ 22, రవీంద్ర జడేజా 29 పరుగులు చేశారు.