గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
central minister Anurag Thakur said brs mlc Kavitha number will come must go to jail
తెలంగాణలో తప్పు చేసిన నేతలు ఎవరూ తప్పించుకోలేరని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(anurag thakur)పేర్కొన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్(raja singh) నామినేషన్ ర్యాలీకి హాజరైన సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్(kcr) పార్టీ పేరు మార్చి రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కూడా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో ఎంత దోపిడీ చేసినా సరిపోలేదని ఢిల్లీకి వచ్చారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తప్పు చేసిన వారు ఎవ్వరైనా కూడా తప్పించుకోలేరని..వారి నంబర్ కూడా వస్తుందని, అప్పుడు వారు జైలుకు వెళ్లక తప్పదని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవిత తప్పకుండా జైలుకు వెళ్తుందని పలువురు నేతలు భావిస్తున్నారు.
VIDEO | BJP candidate from Goshamahal constituency Raja Singh took out a bike rally in Dhoolpet, Hyderabad after offering prayers at Akashpuri Hanuman Mandir earlier today. He was accompanied by Union minister Anurag Thakur.#TelanganaElection2023#AssemblyElectionsWithPTI… pic.twitter.com/rPMbA4P9f7
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పే కేసీఆర్ కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు చెప్పిన గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య పొత్తు ఉందనే ప్రచారం నిజం కాదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పరస్పర అవగాహన కుదిరిందన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్ టికెట్లను నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ చాలా కాలంగా మహిళలకు తప్పుడు వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాల నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Hyderabad, Telangana: Union Minister Anurag Thakur says, “…It is being heard that BRS is deciding Congress’ tickets…It is clear that BRS & Congress have a mutual understanding…Congress for a long time made false promises to women of the country…BJP will give the… pic.twitter.com/fJKYhm8KSQ
రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నవంబర్ 30న ఉదయం 5 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కొన్ని స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలావుండగా భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. నవంబర్ 30న జరిగే ఎన్నికలకు 35 మంది అభ్యర్థుల పేర్లు జాబితాలో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ కులాచారి, ఆందోల్ (SC) నుంచి పల్లి బాబు మోహన్ పోటీకి దిగారు. మేకల సారంగపాణి సికింద్రాబాద్ నుంచి, చిత్తరంజన్ దాస్ జడ్చర్ల నుంచి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో ఒక్క మహిళా అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి మాత్రమే హుజూర్నగర్ నుంచి పోటీ చేయనున్నారు.