Delhi Pollution: ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. AQI 450 కంటే ఎక్కువ నమోదైంది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం 14 పనులను నిషేధించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలను కొనసాగిస్తూనే కొత్త నిషేధాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలన్నింటినీ క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
ఏది నిషేధించబడింది?
• బోరింగ్-డ్రిల్లింగ్ పనులతో సహా త్రవ్వడం, నింపడం కోసం మట్టి పనిని నిషేధించింది.
• నిర్మాణం, భవన కార్యకలాపాలతో సహా అన్ని నిర్మాణ పనులపై నిషేధం.
• కూల్చివేతకు సంబంధించిన పనులపై నిషేధం
• ప్రాజెక్ట్ సైట్ లోపల లేదా వెలుపల ఎక్కడైనా నిర్మాణ సామగ్రిని లోడ్ చేయడం లేదా అన్లోడ్ చేయడం నిషేధం.
• ముడి పదార్థాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడాన్ని నిషేధించింది
• చదును చేయని రోడ్లపై వాహనాల రాకపోకలు నిషేధం
• ప్యాచింగ్ ప్లాంట్ నిర్వహణపై నిషేధం
• ఓపెన్ ట్రెంచ్ సిస్టమ్ ద్వారా సీవర్ లైన్, వాటర్ లైన్, డ్రైనేజీ వర్క్, ఎలక్ట్రిక్ కేబుల్ వేయడంపై నిషేధం.
• టైల్స్, రాళ్ళు, ఇతర ఫ్లోరింగ్ మెటీరియల్స్ కత్తిరించడం, ఫిక్సింగ్ చేయడంపై నిషేధం.
• పైలింగ్ పనులపై నిషేధం
• వాటర్ ప్రూఫింగ్ పనులపై నిషేధం
• పెయింటింగ్, పాలిషింగ్ పనులపై నిషేధం
• ఫుట్‌పాత్‌లు, రోడ్లను మరమ్మత్తులు చేయడం నిషేధం
ఢిల్లీలో 14 పనులపై నిషేధం విధిస్తూ గోపాల్‌రాయ్ మాట్లాడుతూ.. ‘నిషేధించిన ఈ 14 పనులు.. ఎవరైనా సగం రోడ్డు నిర్మించి ఆపేస్తున్నారనుకోండి, అక్కడ దుమ్మును నియంత్రించే బాధ్యత అతనిదే.. అని పేర్కొన్నాడు. అలాగే ‘ఢిల్లీలో, ఇండోర్ పనులైన ప్లంబింగ్, విద్యుత్, వడ్రంగి, ఇంటీరియర్ డెకరేషన్ వర్క్ వంటి నాన్-డస్ట్ జెనరేటింగ్ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించారు.