»Uorfi Jawed Arrested By Mumbai Police For Wearing Revealing Dresses Video Went Viral
Uorfi Jawed Arrested: నడిరోడ్డుపైనే నటి ఉర్ఫీ జావెద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
బిగ్ బాస్ OTT ఫేమ్ ఉర్ఫీ జావేద్ తన అసాధారణ దుస్తుల కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Uorfi Jawed Arrested: బిగ్ బాస్ OTT ఫేమ్ ఉర్ఫీ జావేద్ తన అసాధారణ దుస్తుల కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉర్ఫీని అరెస్టు చేసి తమతో తీసుకువెళుతున్నారు. ఈ వీడియోను ఇన్స్టంట్ బాలీవుడ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీడియోలో ఉర్ఫీ రెస్టారెంట్ లోపల నుండి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. బయటకు రాగానే ఇద్దరు లేడీ పోలీస్ కానిస్టేబుళ్లు ఆమె ఎదురుగా వచ్చి తమతో రమ్మన్నారు. ఇది విన్న ఉర్ఫీ, నేనేం చేశానని అడుగుతుంది. దానికి సమాధానంగా ఒక పోలీసు కానిస్టేబుల్ మీరు చిన్న బట్టలు ధరించి తిరుగుతున్నారు.. అందుకే మీరు మాతో రావాలని చెప్పాడు. ఆమె మరో ఒకట్రెండు ప్రశ్నలు వేసి వారితో నడవడం ప్రారంభించింది. పోలీసులు ఉర్ఫీని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం ఉర్ఫీ పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, కొంతమంది దీనిని ఫేక్, స్క్రిప్ట్ అని పిలుస్తారు. ఒక నెటిజన్ ‘ఇప్పుడు పోలీసులు కూడా రీల్స్ చేయడం మొదలెట్టేశారు. మరొక నెటిజన్ – ‘డ్రామా కంపెనీ’. ఇంకొక నెటిజన్- ‘ఇది చాలా మంచి స్క్రిప్ట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.