»Renu Desai Renu Desai Made Critical Comments On Pawan
Renu Desai : పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్
పవన్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు రేణూ దేశాయ్‌పై కొందరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ట్రోల్స్‌పై రేణూ స్పందించారు. ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై రేణూ దేశాయ్ (Renu Desai) కీలక వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్‌ను తాను సపోర్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్స్ (Trolls) చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ట్రోల్స్‌కు రేణూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ తనకు అన్యాయం చేసిన మాట వాస్తవమేనని, దానిని పక్కకు పెట్టి మరీ పవన్ కోసం మాట్లాడ్డంలో ఒక అర్థం ఉందన్నారు. పవన్ ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టే తాను జనసేనానికి సపోర్ట్‌గా మాట్లాడినట్లు స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ (Renu Desai) యాక్టీవ్‌గా ఉండటమే కాకుండా చాలా విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఆమె చాలా గ్యాప్ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తాజాగా ఆమె తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి పలు వ్యాఖ్యలు చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ (Comments Viral) అవుతున్నాయి.
పవన్ తనకు తీరని అన్యాయం చేసిన మాట వాస్తవమేనని, ప్రజలకు పవన్ మంచి చేస్తారేమోననే కోణంలో సపోర్ట్ చేస్తున్నట్లు ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి కోణం అనేది కచ్చితంగా ఉంటుందని, వ్యక్తిగత జీవితం పక్కన పెడితే పవన్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, ఆయన ప్రజలకు మంచి చేస్తారని తాను భావిస్తున్నట్లు రేణూ దేశాయ్ (Renu Desai) అన్నారు.
10 ఏళ్ల పవన్ పొలిటికల్ జర్నీ (Political Journey)ని గమనించిన తాను ఓ సాధారణ సిటిజన్లా మాట్లాడే హక్కు ఉందని అన్నారు. పవన్‌కి డబ్బు పిచ్చి లేదననారు. డబ్బే కావాలనుకుంటే పాన్ ఇండియా సినిమాలు చేసేవాడన్నారు. అకీరా సినిమా ఎంట్రీకి పవన్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో తాను పవన్ గురించి మంచిగా మాట్లాడుతున్నట్లు కొందరు తనను ట్రోల్ చేశారన్నారు. ఆ ట్రోల్స్‌కు రేణూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అకీరాకు తండ్రి అని, తన బిడ్డ అకీరా సినిమా ఛాన్సుల కోసం పవన్‌ను అడగాల్సిన అవసరం లేదన్నారు. తన మాటలను కొందరు వక్రీకరించి ట్రోల్స్ చేశారని రేణూ ఆవేదన వ్యక్తం చేశారు.