»They Wanted To Gain More Followers On Instagram Got Arrested Instead
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కోసం ప్రయత్నించారు.. అరెస్ట్ అయ్యారు
సోషల్ మీడియాలో ఫాలొవర్స్ కోసం యువకులు చేసే విన్యాసాల గురించి తెలిసిందే. కారును వెనకకు నడిపి వైరల్ అయ్యారు. ఫాలొవర్స్ వస్తారు అనుకుంటే పోలీసులు వచ్చారు. అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
They Wanted To Gain More Followers On Instagram, Got Arrested Instead
Viral News: ఇన్స్టాగ్రామ్(Instagram) రీల్ చేసి ఫేమస్ కావాలనే ఉద్దేశంతో గురుగ్రామ్(Gurugram)లోని ముగ్గురు వ్యక్తులు విన్యాసం చేశారు. ఫలితంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫాలొవర్స్ పెంచుకోవాలనే కోరికతో రద్దీగా ఉండే గురుగ్రామ్ రోడ్లో కారు స్టంట్ చేస్తూ రీల్‌ను చిత్రీకరించారు. అందువల్ల ట్రాఫిక్ జామ్ అయింది. వీడియోలో చూసినట్లైతే గోల్ఫ్ కోర్స్ రోడ్డులో రివర్స్ గేర్‌లో ఎర్రని కారు వెళ్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో హర్యాన్వి పాటతో మరో మూడు కార్లు వచ్చాయి. దీన్ని షూట్ చేసి పోస్ట్ చేశారు. వీడియో వైరల్ అయి ఫాలోవర్స్ వస్తారు అనుకుంటే.. బదులుగా, పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి కార్లను పోలీసులు సీజ్ చేశారు.
అక్టోబర్ 23న గోల్ఫ్ కోర్స్ రోడ్లో వాహనాల్లో ఉన్న వ్యక్తులు అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. కార్లపై విన్యాసాలు చేస్తూ రీల్‌ను చేస్తున్నారు అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కపిల్ అహ్లావత్ తెలిపారు. ఇలాంటి వీడియోలు చేయవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇది మీకు మాత్రమే ప్రమాదకరం కాదు ఇతరులకు కూడా హానికరమైనదే అని తెలిపారు. గురుగ్రామ్‌లో ఇలాంటి కేసు మొదటిసారి కాదు. కార్లలో వెళుతూ బాణా సంచా కాల్చిన సంఘటన కూడా ఆ మధ్య వైరల్ అయింది. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలకు నగర రహదారులు సాక్ష్యంగా నిలుస్తున్నాయని నెటజన్లు ట్వీట్లు చేస్తున్నారు.