Gangavva: యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వ (Gangavva).. మై విలేజ్ షో పేరుతో పాపులర్ అయ్యింది. తర్వాత బిగ్ బాస్ గేమ్ షో కూడా చేసింది. ఆడపా దడపా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గంగవ్వ వస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇంకేముంది హాల్ కెపాసిటీ ఓ రెండు వేల వరకు కూర్చొనే వెసులుబాటు ఉంది. అక్కడికి వచ్చిన జనం మాత్రం 6 వేల పైచిలుకు.. ఇది కదా గంగవ్వ క్రేజ్ అంటే అంటున్నారు నిర్వహకులు.
హాల్ నిండటం.. బతుకమ్మలతో వచ్చిన కొందరు వెళ్లిపోవడం కూడా జరిగింది. దీంతో నిర్వాహకుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇంత మంచిగా ఏర్పాట్లు చేశామని.. సరిపోవడం లేదని బాధ పడ్డారు. ఇక ఇండోర్ స్టేడియంలోకి గంగవ్వ ఎంటర్ అయితే ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. దుబాయ్‌లో గంగవ్వకు ఇంత క్రేజ్ ఉంటుందని అనుకోలేదని మై విలేజ్ షో నిర్వాహకుడు శ్రీకాంత్ అంటున్నారు.
నిజమే.. ఎక్కడ లంబాడిపల్లి.. ఎక్కడి దుబాయ్.. ఆ ముసలమ్మకు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. అంతకుముందు దుబాయ్‌లో గల పర్యాటక ప్రాంతాలను గంగవ్వ అండ్ టీమ్ చుట్టి వచ్చారు. బుర్జ్ ఖలీపా ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటికి నెటిజన్లు కామెంట్లు రాస్తున్నారు.