»Suresh Gopi Malayalam Actors Indecent Behavior Apologizes To Woman Journalist
Suresh Gopi: మలయాళ నటుడు అసభ్య ప్రవర్తన.. మహిళా జర్నలిస్ట్‌కు క్షమాపణ
మహిళా విలేకరితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డాడు. దీంతో సురేశ్ గోపీ సోషల్ మీడియా ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పారు.
Suresh Gopi: మలయాళ స్టార్ హీరో కమ్ పొలిటిషీయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్య ప్రవర్తన చేయడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సురేశ్ గోపి సోషల్ మీడియా ద్వారా మహిళా విలేకరికి క్షమాపణ చెప్పారు. తాను ఆ మహిళా విలేకరిని తన కుమార్తెగానే భావిస్తున్నానని, తనను అనుచితంగా తాకినట్లు ఆమె భావించిన పక్షంలో ఒక తండ్రిలాగా ప్రవర్తించానే తప్పా వేరే ఉద్దేశంతో కాదని సురేశ్ గోపి వివరణ ఇచ్చారు.
తన జీవితంలో ఎవరి పట్ల మర్యాద లేకుండా వ్యవహరించలేదని, సినిమాల్లో లేదా బయటకాని తాను ఏ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని సురేష్ గోపి పేర్కొన్నారు. తన ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉన్నట్లయితే అందుకు క్షమాపణ చెబుతున్నానని సోషల్ మీడియా ద్వారా ఆ మహిళా విలేకరికి తెలిపారు. నార్త్ కోయ్కోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేశ్ గోపీ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్‌లతో మాట్లాడారు. ఈక్రమంలోనే ఓ మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చేయి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడిన ఆమె కాస్త దూరం జరిగింది. మళ్లీ ఇంకో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా ఆయన మరోసారి తాకారు. నెటిజన్లు, సినీ నటులు ఆయన ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.