»Pjr Son Vishnu Vardhan Reddy Resigned To Congress Party
Congressకు పీజేఆర్ కుమారుడు గుడ్ బై..? టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ను పార్టీ అజారుద్దీన్‌కు కేటాయిచింది. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
PJR Son Vishnu Vardhan Reddy Resigned To Congress Party
Vishnu Vardhan Reddy: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయగా అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. దివంగత నేత, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారు. ఈ సారి కూడా తనకు టికెట్ లభిస్తోందని ఆశించారు. అనూహ్యంగా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు టికెట్ కేటాయించారు.
టికెట్ రాకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవారు.. పార్టీ కోసం తన తండ్రి కష్టపడ్డారని.. తాను కూడా పార్టీ కోసం శ్రమించానని గుర్తుచేశారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ టికెట్లు ఇచ్చారని.. భార్య భర్తలు, హాఫ్ టికెట్ గాళ్లకు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తమ్- పద్మావతి దంపతులు, మైనంపల్లి హన్మంతరావు- రోహిత్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
ఒక్కొక ఇంట్లో రెండు రెండు టిక్కెట్లు ఇచ్చారు.. కొందరు అయ్యలకు, హాఫ్ టికెట్ గాళ్ళకి టికెట్ ఇచ్చారు
పార్టీకోసం కష్టపడ్డా, హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవాళ్ళు.
జూబ్లీహిల్స్ నుండి పోటీలో ఉంటా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా – విష్ణువర్ధన్ రెడ్డి pic.twitter.com/dcMgs9LWBV
సర్వేలో సిటీలో జూబ్లీహిల్స్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తేలిందని.. ఇప్పుడు ఆ సీటు కోల్పోతుందని పేర్కొన్నారు. అనుచరులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీలో ఉంటానని హింట్ ఇచ్చారు. ఈవీఎంలో తన పేరు ఉండాల్సిందేనని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇండైరెక్టుగా చెబుతున్నారు. విష్ణు సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును కేటాయించారు.