Rahul Gandhi కాదు రాంగ్ గాంధీ, రేవంత్ డీఎన్ఏ ఏంటీ: హరీశ్ నిప్పులు
బీజేపీని వ్యతిరేకించే డీఎన్ఏ తనలో ఉందని రాహుల్ గాంధీ అన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఎందులో ఉంది.. ఏబీబీపీ, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao, KTR: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారు. చెరకు సుధాకర్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో పార్టీలో చేరారు. ఘర్ వాపసీ అంటూ హరీశ్ స్వాగతం పలికారు. ఉద్యమ సమయంలో చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు.
కేసీఆర్ (kcr) నాయకత్వంలో రాష్ట్రం డెవలప్ అవుతుందని.. భావించి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ గురిపెట్టిన వ్యక్తి.. ఇప్పుడు పీసీసీ చీఫ్ అని గుర్తుచేశారు. ఆనాడు రాజీనామా చేయమని కోరితే.. చేయని వ్యక్తి ఇప్పటి బీజేపీ అధ్యక్షుడు అని తెలిపారు. మళ్లీ గెలుస్తానో గెలవనో అని వెన్ను చూపించాడని విమర్శించారు. 14 ఏళ్లు పోరాటం చేసి.. ప్రాణ త్యాగం చేసేందుకు సిద్దపడ్డ వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
రానే రాదన్న తెలంగాణ ద్రోహులు ఒకవైపు.. మరోవైపు తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ ఒకవైపు అని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే తన డీఎన్ఏలో ఉందని రాహుల్ గాంధీ అంటున్నారు. మరీ మీ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఎముందని అడిగారు. ఏబీవీపీ ఉందా.. బీజేపీ ఉందా.. టీడీపీ ఉందా బీఆర్ఎస్ ఉందా.. కాంగ్రెస్ ఉందో చెప్పాలని అడిగారు. మీ డీఎన్ఏ, రేవంత్ డీఎన్ఏ మ్యాచ్ కావడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ అని గుర్తుచేశారు. ఆనాడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు అని వివరించారు.
సోనియాను బలిదేవత అని దూషించిన వారిని పీసీసీ చీఫ్ అని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్కు లెహర్ లేదని.. ఉంది జహర్ (విషం) ఉందన్నారు. జుటా ప్రచారం చేస్తోన్న రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీ అని మండిపడ్డారు. కర్ణాటకలో రైతులకు విద్యుత్ ఇవ్వడం లేదని.. అందుకే రైతులు కరెంటోళ్ల వద్ద మొసలి విడిచి పెట్టారని పేర్కొన్నారు.