»Interesting Title For Nani New Movie Saripoda Sanivaram
Nani: కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..సరిపోదా శనివారం?
త్వరలోనే హాయ్ నాన్న అంటున్న నాని(nani)..ఇప్పుడు మరో కొత్త సినిమాకు చేయడానికి రెడీ అవుతున్నాడు. అంటేసుందరానికి దర్శకుడితో 31వ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు వెరైటీ టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
Interesting title for Nani new movie saripoda Sanivaram
చివరగా దసరా సినిమాతో మాసివ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని(nani).. ఆ వెంటనే క్లాస్ లుక్‌లోకి వచ్చేశాడు. శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది కాబట్టి.. నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నాని. ‘అంటే సుందరానికి’ సినిమాను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేస్తున్నాడు నాని.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 24న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇంతకుముందు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ లాంటి వెరైటీ టైటిల్స్ పెట్టిన వివేక్ ఆత్రేయ.. నాని సినిమాకు కూడా డిఫరెంట్ టైటిల్ లాక్ చేశాడట. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం(saripoda Sanivaram)’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక హీరోయిన్గా ప్రియాంకా అరుల్ మోహన్ ఫిక్స్ అయిందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న పవన్ ‘ఓజీ’ మూవీలో కూడా ఆమెనే హీరోయిన్. అందుకే.. నాని సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. గతంలో ఈ బ్యూటీ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోను నటించింది. మరి ఈసారైనా నాని, వివేక్ ఆత్రేయ్ హిట్ కొడతారేమో చూడాలి.