»We Stand By Israel And Ukraine Us President Joe Biden Has Said That He Will Never Support The Attacks Of Hamas And Russia Biden Lashed Out At Hamas And Russia Saying That The Two Different Agendas A
Joe Biden: హమాస్, రష్యా ఎజెండా ఒకటే
ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. కానీ హమాస్, రష్యా చేసే దాడులకు ఎప్పుడూ తమ మద్దతు తెలపలేమని అన్నారు. రెండు వేర్వేరు అయినా కూడా వారి ఇద్దరి అజెండా ఒకటేనని హమాస్, రష్యాపై బైడెన్ వ్యాఖ్యలు చేశారు.
President Joe Biden mixes up Taylor Swift and Britney Spears during turkey pardon speech
Joe Biden: తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు ఎల్లప్పుడూ సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపాడు. ఈ క్రమంలో బైడెన్ హమాస్, రష్యాపై విరుచుకుపడ్డారు. హమాస్, రష్యా పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కానీ ఈ రెండింటి అజెండా మాత్రం ఒకటేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే వాళ్ల లక్ష్యమని ఆరోపించారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు కీలకమని బైడెన్ పేర్కొన్నారు.
మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు చిన్నపాటి రాజకీయ విభేదాలు అడ్డు కాకూడదన్నారు. హమాస్ వంటి ఉగ్రవాదులు, పుతిన్ వంటి శక్తులను ఎప్పటికీ మనం గెలవనివ్వకూడదని బైడెన్ పేర్కొన్నారు. ఇలాంటి వాటికి మనం అనుమతిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘర్షణలు ఇంకా వ్యాపిస్తాయని బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నాయకత్వం ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపిందన్నారు. మిత్రదేశాల వల్ల అమెరికా సురక్షితంగా ఉంటుంది. మన విలువలు, విధానాల వల్ల భాగస్వాములు మనతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు సాయం చేయకుండా, ఇజ్రాయెల్‌కు వెన్నుపోటు పొడిస్తే కరెక్ట్ కాదని బైడెన్ తెలిపారు.
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్ వంటి దేశాలకు ఆర్థిక సహకారం, మానవతా సాయం, సరిహద్దుల నిర్వహణ కోసం 100 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఈ భారీ విరాళాన్ని కాంగ్రెస్ ఆమెదించాలని కోరారు. యుద్ధాల్లో రెండు దేశాలు గెలిచేలా మనం అండగా ఉండటం అమెరికా ప్రయోజానాలకు మంచిదన్నారు. చిన్నసాయం.. భవిష్యత్తులో అమెరికా భద్రతలకు మూలం అవుతుందన్నారు. అమెరికాను ప్రపంచ లీడర్‌గా నిలపెడుతుందని బైడెన్ తెలిపారు.