»Lawyer Gay Couple Ananya Kotia And Utkarsh Saxena Proposed Them Selves In Front Of Supreme Court Exchanges Ring Said Fight Will Be Continued
Gay Lawyer Couple Exchanged Ring: సుప్రీంకోర్టు ముందే రింగ్ పెట్టి ప్రపోజ్.. పోరాటం ఆగలేదన్న లాయర్ గే జంట
భారతదేశంలో స్వలింగ వివాహాన్ని ఆమోదించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్కుల లాయర్ జంట అసాధారణ రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
Gay Lawyer Couple Exchanged Ring: భారతదేశంలో స్వలింగ వివాహాన్ని ఆమోదించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్కుల లాయర్ జంట అసాధారణ రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్ ఎదుట ఉంగరాలు ధరించి నిశ్చితార్థం చేసుకున్నామని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ జంటలో ఒకరి పేరు అనన్య కోటియా కాగా, మరొకరి పేరు ఉత్కర్ష్ సక్సేనా. వారిద్దరూ బుధవారం (అక్టోబర్ 18) ఒకరినొకరు వివాహం చేసుకున్నారు.
Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn’t about a legal loss, but our engagement. We’ll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I
అనమ్య కోటియా సుప్రీంకోర్టు ముందు మోకాళ్లపై ఉత్కర్ష్‌ను ప్రపోజ్ చేసి ఉంగరం ధరించి నిశ్చితార్థం చేసుకున్నారు. అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఫోటో పంచుకున్నాడు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. విశేషమేమిటంటే, అనన్య, ఉత్కర్ష్ ఇద్దరూ సుప్రీంకోర్టులో న్యాయవాదులు.. అంతే కాకుండా వారిద్దరు స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతి కోసం పిటిషన్ వేసిన వారిలో ఉన్నారు. ఉత్కర్ష్ సక్సేనా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుండి పిహెచ్డి, అతని భాగస్వామి అనన్య లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పిహెచ్డి అందుకున్నారు. వీరిద్దరూ డీయూలోని హన్స్‌రాజ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కలిశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మంగళవారం (17 అక్టోబర్ 2023) చారిత్రాత్మక నిర్ణయంలో స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.