War 2: షూటింగ్ షురూ.. ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే?
ట్రిపుల్ ఆర్ తర్వాత మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్పై యూనివర్స్లోభాగంగా వార్2(war2)ని.. ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్ 2(war2) సినిమా నిలవబోతోంది. అసలు హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. కానీ ఈ స్పై యూనివర్స్ అనౌన్స్మెంట్తోనే సంచలనం క్రియేట్ చేసింది బాలీవుడ్ బడా సంస్థ యశ్ రాజ్ ఫిలింస్. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే.. మాటలు కాదు. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ చేసిన నెగెటివ్ రోల్ జస్ట్ శాంపిల్ మాత్రమే. కానీ వార్ 2లో విశ్వరూపం చూపించబోతున్నాడు ఎన్టీఆర్. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పవర్ ఫుల్‌గా డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో స్టార్ట్ అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇంకా ఈ సెట్లోకి హృతిక్ రోషన్ జాయిన్ అవలేదు. ప్రస్తుతం హీరోలు లేకుండా కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే హృతిక్ రోషన్‌తో పాటు యంగ్ టైగర్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు తారక్. ఇది కంప్లీట్ అవగానే.. నవంబర్‌లో వార్2 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. అందుకే.. యుద్ధభూమి నీ కోసం వెయిట్ చేస్తోంది యంగ్ టైగర్ అంటూ.. వార్2(war2) షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్(comments) చేస్తున్నారు. అసలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. అలాంటిది.. ఈ ఇద్దరు హీరోలను బిగ్ స్క్రీన్ పై తలపడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.