సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా క్వైట్ మోడ్ ఫీచర్ అప్ డేట్ చేసింది. ప్రైవసీ కోరుకునేవారికి ఇదీ చక్కగా పనిచేస్తోంది. ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరించేందుకు ఇన్ స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. యూజర్ ప్రొఫైల్ కింద క్వైట్ మోడ్ అని కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలట. ఎనేబుల్ చేసిన తర్వాత టైమ్, డేట్‌ని సెలక్ట్ చేసి ఆ సమయం వరకు క్వైట్ అయిపోవచ్చు. నిర్దేశించిన తేదీ, సమయం వరకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలాంటి మెసేజ్, నోటిఫికేషన్లు రావు. ఇది గుర్తుతెలియని వారి నుంచి మెసేజ్ వచ్చి విసిగిపోయేవారికి చక్కగా పనిచేస్తోంది.
మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి ‘యూజర్ క్వైట్ మోడ్‌లో ఉన్నాడు’ అని బాటమ్‌లో రిప్లై వస్తోంది. దీంతో సదరు యూజర్ మరొసారి మెజేస్ చేయడు. ఇన్‌స్టాలో బిజీ షెడ్యూల్స్ ఉన్నవారికి ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది. బీటా వెర్షన్లో ఉన్న ఫీచర్‌ని త్వరలో మిగతా యూజర్లకు అప్డేట్ ఇస్తారట. సో మీరు బిజీ ఉంటే క్వైట్ మోడీ అన్ చేయండి. ఇంకేముంది మీకు ఎలాంటి మెసేజ్ రాదు. దాంతోపాటు నోటిఫికేషన్లు కూడా రావని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇన్ స్టాలో ఎక్కువ రీల్స్ చేస్తుంటారు. షార్ట్స్ కూడా ఎక్కువగా అప్లోడ్ అవుతుంటాయి. కంటెంట్ మాత్రం టైమింగ్ కామెడీతో ఉంటుంది. పిల్లలు, పెద్దలు అని తేడా చూడకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా వాటినే చూస్తారు. ఇప్పుడు ఇన్ స్టాకే ఎక్కువ యూజర్లు ఉన్నారు. ఫేస్ బుక్‌లో వీడియోలో యూట్యూబ్‌లలో షార్ట్స్ ఎక్కువ వస్తుంటాయి.