కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో మాజీ మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. తుమ్మల పార్టీలో చేరిన తర్వాత రాహుల్‌ను కలవడం ఇదే తొలిసారి.ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్నరు. ఆయన పార్టీలో చేరిన రోజు రాహుల్ గాంధీ సమయం ఇవ్వలేకపోయారు. దీంతో అధిష్ఠానం తుమ్మలను పిలిపించుకుంది.దాదాపు అరగంటసేపు రాహుల్ గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)లు సమావేశమయ్యారు.
రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ(Telangana)లో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం(Khammam) జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉన్న పొలిటికల్ ట్రెండ్స్ పై చర్చించినట్లు సమాచారం.ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల పోటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)ని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంచునట్లు అధిష్టానం సంకేతాలు ఇచ్చింది