చిత్రం: గాడ్ నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిష్ విద్యార్థి, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి తదితరులు ఛాయాగ్రహణం: హరి కె.వేదాంతం సంగీతం: యువన్ శంకర్ రాజా నిర్మాతలు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ కథ, కథనం మాటలు, దర్శకత్వం: ఐ. అహ్మద్ విడుదల తేదీ: 13/10/2023
వీకెండ్ వస్తుందంటే చాలు సినిమాల మోత మోగిపోతుంది. ఈవారం నయనతార, జయం రవి కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’ విడుదలైంది. సినిమా క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సైకో థ్రిల్లర్ జోనర్లో రిలీజ్ అయిన మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. పదండి.
కథ
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా పని చేసే అర్జున్‌కు (జయం రవి) భయమంటే ఏంటో తెలియదు. కోపం, దూకుడు రెండూ ఎక్కువే. నేరస్థుల్ని శిక్షించడానికి చట్టానికి కూడా ఎదురెళ్తాడు. అర్జున్‌కు తన కొలిగ్ ఆండ్రూ (నరైన్) మంచి స్నేహితుడు. వాళ్ల కుటుంబాన్ని సొంత కుటుంబంలా భావిస్తుంటాడు. నరైన్ సోదరి ప్రియ (నయనతారు) ఇష్టపడతాడు. కానీ తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలిసి దూరం ఉంటాడు. అలా జీవితం సాఫీగా సాగుతుంది అనుకున్నప్పుడు వాళ్లకు కిల్లర్ బ్రహ్మ రూపంలో సవాల్ ఎదురవుతోంది. ఈ కిల్లర్ నగరంలో ఉండే అనేకమంది యువతుల్ని కిడ్మాప్ చేసి.. వాళ్లను హత్య చేసి తప్పించుకుంటాడు. అతనిని పట్టుకునేందుకు అర్జున్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆండ్రూ చనిపోతాడు. ఆ బాధలో అర్జున్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకుంటాడు. కానీ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకోవడం వల్ల మళ్లీ నగరంలో హత్యలు ప్రారంభం అవుతాయి. ఇక అర్జున్ స్నేహితులనే లక్ష్యం చేసుకుని కిడ్నాప్ చేస్తుంటాడు. అర్జున్ బ్రహ్మను పట్టుకునేందుకు ఎలాంటి పన్నాగం పడతాడు. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. ప్రియాతో ప్రేమ ఎలా మొదలవుతుంది అన్నది స్టోరీ.
ఎలా ఉందంటే?
నగరంలో సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటే అతని ఆట కట్టించేందుకు అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఇలాంటి సినిమాలు ఎక్కువగా మైండ్ గేమ్‌తో ఉండాలి. చూస్తే ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ఉండటంతోపాటు ఆసక్తిగా ఉండాలి. కానీ నేరం జరిగే తీరు ఉత్కంఠగా ఉన్నా.. సస్పెన్షన్ అంత ఆసక్తిగా అనిపించదు. అర్జున్ పాత్ర పరిచయం చేస్తూనే.. క్షణం ఆలస్యం కాకుండా అసలు కథ స్టార్ట్ అవుతుంది. నగరంలో అమ్మాయిలు కిడ్మాప్ కావడం.. తర్వాత సైకో చేతుల్లో హత్యకు గురికావడం, అర్జున్ వాళ్లను ఛేదించడంతో కథ ఫాస్ట్‌గా సాగుతుంది. తర్వాత హత్యలన్నీ సైకో ఎలా చేశారన్నది స్లో జోనర్లో కనిపిస్తుంది. సైకో కిల్లర్ వెనుక ఇంకో సైకో కిల్లర్ ఉన్నాడనే విషయంతో సినిమా ఫస్ట్ ఆఫ్ పూర్తవుతుంది. ప్రథమార్థంలానే ద్వితీయార్థంలో కూడా కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు. ఈసారి అర్జున్ స్నేహితులను టార్గెట్ చేస్తాడు. దీంతో కథ మళ్లీ పుంజుకుంటుంది. హత్యలు చేసింది కిల్లర్ బ్రహ్మనా.. లేకపోతే అతని వెనుకున్న కిల్లరా? అనే విషయాలపై సెకండ్ ఆఫ్ నడుస్తుంది. చూస్తుండగానే హీరో వరుస హత్యలు కనిపెట్టేయడం, సైకో కిల్లరే తన కథను చెప్పడం అంత ఆసక్తిగా అనిపించదు. చివరికి హీరో, సైకో కిల్లర్ తలపడే తీరు ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
సినిమా మొత్తం అర్జున్ (జయం రవి) పాత్రతో తిరుగుతుంది. సీరియస్ లుక్స్‌తో, సహజమైన నటనతో జయం రవి మెప్పిస్తాడు. సినిమా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో జయం రవి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమానే ఇది. గాడ్ సినిమాలో రెండు మూడు సీన్లలోనే నయనతార కనిపిస్తుంది. మూవీలో ఆమె పాత్రకు అంత ప్రయారిటీ లేదు. ఓ పాట కోసం ఆమెను తీసుకున్నట్టు అనిపిస్తోంది. సైకో కిల్లర్స్ వాళ్ల నటనతో మెప్పించేశారు. సైకో కిల్లర్స్ ఎందుకు హత్యలు చేశారు. వాటి వెనుక ఉండే కారణాలు చూపించలేదు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు కథను అంతగా ఆసక్తికరంగా తీర్చిదిద్దలేదు. సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం బలాన్నిచ్చింది. నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం బాగున్నాయి. సినిమాల్లో అన్నీ తానై నటించి, మెప్పించారు జయం రవి.
ప్లస్ పాయింట్స్
+జయం రవి నటన
+ఉత్కంఠకు గురిచేసే కొన్ని సీన్స్
+సెకండాఫ్ నెరేషన్