తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్నిచ్చింది. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూరేలా ఈ-గవర్నెన్స్, హెల్త్ కేర్, మున్సిపల్ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఈ డేటా సెంటర్లను ఉపయోగిస్తాం. ఈ డేటా సెంటర్ తో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్ గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుంది’ అని కేటీఆర్ తెలిపారు.
కాగా ఏడబ్ల్యూఎస్ పెట్టుబడులను దశలవారీగా హైదరాబాద్ లోని చందన్ వెల్లి, ఎఫ్ఏబీ సిటీ, ఫార్మా సిటీల్లోని డేటా సెంటర్లలో పెట్టనుంది. ఈ పెట్టుబడితో అమెజాన్ కంపెనీతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అయ్యింది. ఇప్పటికే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో అమెజాన్ నెలకొల్పిన విషయం తెలిసిందే.
We welcome @awscloud’s commitment to invest ₹36,300 Cr (increased from previously announced ₹20,096 Cr) to set up AWS state-of-the-art data centres in Hyderabad.