»Irctc Advice To Passengers Do Not Order Food On These Websites
IRCTC అలర్ట్..ఈ వెబ్ సైట్లలో ఫుడ్ ఆర్డర్ చేయోద్దు
ట్రైన్లలో జర్నీ చేసే ప్రయాణికులకు IRCTC అలర్ట్ జారీ చేసింది. కొన్ని అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్, వెబ్ సైట్లలో ఆహారాన్ని కొనుగోలు చోయోద్దని సూచించింది. అంతేకాదు అధికారిక వెబ్ సైట్లలో ఎలా ఆర్డర్ బుక్ చేయాలో కూడా తెలిపింది.
IRCTC advice to passengers DO NOT ORDER FOOD ON THESE WEBSITES
దేశవ్యాప్తంగా నిత్యం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు IRCTC పలు సూచనలు జారీ చేసింది. కొన్ని గుర్తింపులేని వెబ్ సైట్స్, యాప్స్ లలో ఫుడ్ ఆర్డర్ చేయోద్దని తెలిపింది. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ మేరకు ఆయా వెబ్ సైట్ల జాబితాను ప్రకటించింది.
దిగువ పేర్కొన్న వెబ్సైట్లను అనుసరించవద్దని IRCTC రైలు ప్రయాణికులను కోరింది.
అయితే ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ ద్వారా రైలులో ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవాలని తెలిపింది. అందుకోసం www.ecatering.irctc.co.inలేదా ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్లో IRCTC ఇ-కేటరింగ్ అధికారిక పోర్టల్లో మాత్రమే ఆర్డర్ చేయాలని సూచించింది. లేదా 1323కి కాల్ చేయాలని వెల్లడించింది. దీంతోపాటు +91-8750001323కి WhatsApp చేసి మీ సీటుకు ఆహారాన్ని డెలివరీ చేసుకునే విధంగా ఆర్డర్ చేయవచ్చని తెలిపింది.
IRCTC ఇ-కేటరింగ్ సేవ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. కొన్ని ప్రధాన స్టేషన్లు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, మధుర, CSMT, నాగ్పూర్, పాత ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు సిటీ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, చెన్నై సెంట్రల్, కాన్పూర్, వారణాసి సహా మరికొన్ని అందుబాటులో ఉన్నాయి. IRCTC రైల్వే ప్రయాణీకుల కోసం 2014 సంవత్సరంలో ఇ-క్యాటరింగ్ సేవలను ప్రారంభించింది. తద్వారా వారు ప్రసిద్ధ బ్రాండ్లతో పాటు ప్రాంతీయ, స్థానిక రుచికరమైన వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత రైల్వే స్టేషన్లో సిబ్బంది మీ సీట్ల వద్దకు ఫుడ్ డెలివరీ చేస్తారు.