ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ”అన్ స్టాపబుల్” టాక్ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్ కన్నా రెండో సీజన్ లో విపరీతమైన క్రేజ్ ను ఈ షో సొంతం చేసుకుంది. బాలయ్య తన ప్రశ్నలతో సెలబ్రిటీల నుంచి సమాధానాలు రాబట్టుతున్నాడు. ఈ షోకు ఇప్పటి వరకూ సెలబ్రిటీలే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు.
Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala show…🔥🌪️ The Baap Of All Episodes In The Baap Of All Talkshows in India arriving soon.⚡Stay tuned for #PawanKalyanOnAHA#UnstoppableWithNBKS2!🤩✨ pic.twitter.com/dQtnteszsa
సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన టీజర్ ను ఆహా రిలీజ్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ టీజర్ సందడి చేస్తోంది.