బీహార్(Bihar)లో ఓ కాలేజీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సివాన్ జిల్లాలో జా ఇస్లామియా (Ja Islamia) పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా,సన్నితంగా మెలిగిన కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని పెర్కోన్నారు.
నిజానికి ఇది బాలుర కళాశాల (Boys College) కాగా, ఇటీవలి సంవత్సరాల్లో మహిళా విద్యార్థులను కూడా చేర్చుకుంటున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ తేవడం కోసం, క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యేలా చూడడమే ఈ ఆదేశాలు తీసుకురావడం వెనుక ఉద్దేశ్యమని కళాశాల తెలిపింది. క్రమశిక్షణ కోసమేనంటూ, సమాజంలో అన్యాయానికి చోటు లేదని పేర్కొంది.
ఇటీవలే కళాశాలలో ఇద్దరు మహిళా విద్యార్థినులు ఒకే లవర్ (Boy friend) కోసం గొడవ పడగా, అది పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటివి అరికట్టే ఉద్దేశ్యంతోనే తాజా ఆదేశాలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మహిళా హక్కుల కార్యకర్తలు మాత్రం ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మేజర్(Major)లను ఏది సరైనదో తెలుసుకునే స్వయంప్రతిపత్తి ఉందని దీని వల్ల వారి స్వేచ్చను హరిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు